Malla Reddy : కాంగ్రెస్ ను మల్కాజిగిరిలో ఓడిస్తా.. మల్లారెడ్డి ఛాలెంజ్..!
Malla Reddy : ఇప్పుడు ట్రెండింగ్ పాలిటిక్స్ లో మల్లారెడ్డి ఉంటున్నారు. ఆయన బీఆర్ ఎస్ ప్రభుత్వంలో Brs Party మొన్నటి వరకు మంత్రిగా పని చేశారు. ఇప్పుడు మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయనకు రేవంత్ రెడ్డికి అస్సలు పడదని అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లారెడ్డిని ఎంత టార్గెట్ చేశారో తెలిసిందే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సీఎం Telangana CM Revanth redd అయ్యారు. కానీ ఆయన నేరుగా మల్లారెడ్డి Malla Reddy : కాంగ్రెస్ Congress ను మల్కాజిగిరిలో malkajgiri constituency ఓడిస్తా.. మల్లారెడ్డి ఛాలెంజ్..! గురించి ఎక్కడా మాట్లాడట్లేదు. కానీ ఆ బాధ్యతను మైనంపల్లి హన్మంతరావు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి విషయలో మల్లారెడ్డిన హన్మంతరావు టార్గెట్ చేస్తున్నారు. మొన్న మల్లారెడ్డి కాలేజీకి వెళ్లి స్టూడెంట్ల విషయంలో ఎంత గొడవ చేశారో కూడా చూశాం. అక్కడితో ఆగిపోలేదు.
ఇంకా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అయితే మల్లారెడ్డి కూడా ఏం తగ్గట్లేదు. ప్రతిసభలో కాంగ్రెస్ ను, రేవంత్ ను ఏసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మల్కాజిగిరి పార్లమెంట్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ కు కార్యకర్తలే లేరు.. ఆ పార్టీలో అందరూ ముఖ్యమంత్రులే అంటూ కౌంటర్ వేశారు. అంతే కాకుండా మల్కాజిగిరిలో తన పట్టు గురించి చెప్పుకొచ్చారు.మల్కాజిగిరిలో ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డిని పోటీ చేయిస్తున్నానని.. కాబట్టి ఆయన్ను గెలిపించుకునే సత్తా తనకు ఉందని తెలిపారు. లక్ష్మారెడ్డి తనకంటే చాలా మంచివాడని.. 25 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటూ తెలిపారు మల్లారెడ్డి. అంతే కాకుండా మల్కాజిగిరిలో కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేశానని గుర్తు చేసుకున్నారు.
మల్కాజిరిగిలో ఏడు ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటే.. అన్నింటా బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారని చెప్పారు. ఈ ఏడు నియోజకవర్గాల్లోని కార్పొరేటర్లు కూడా బీఆర్ ఎస్ నేతలే అని తెలిపారు. కాంగ్రెస్ కు ఒక్క కార్పొరేటర్ కూడా లేడని ఎద్దేవా చేశాడు. రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్నా సరే కార్పొరేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను మల్కాజిగిరిలో మట్టి కరిపించానని తెలిపారు మల్లారెడ్డి. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తు చేస్తానని.. మల్కాజిగిరిలో కచ్చితంగా బీఆర్ ఎస్ ను గెలిపిస్తానని తెలిపారు. ఈ ఎన్నికల్లో మల్కాజిగిరిని గెలిచి కేసీఆర్ కు గిఫ్ట్ ఇస్తానని స్పష్టం చేశారు.