Oppo Reno 7 Pro : మొబైల్ ఫోన్స్ యూసేజ్ గతంతో పోల్చితే ఇప్పుడు చాలా పెరిగిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రతీ ఒక్కరు దాదాపుగా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఇకపోతే ఒప్పో ఫోన్స్ కూడా ఇండియాలో బాగానే సేల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే భారత కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న ఒప్పో రెనో 7 5జీ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ త్వరలో లాంచ్ కాబోతున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.ఒప్పో సంస్థ తన రెనో 7 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్స్‌ను భారత్‌లో విడుదల చేయబోతున్నది. వచ్చే నెల 4న ఈ సిరీస్ భారతీయ మార్కెట్ లో అవెయిలబుల్ గా ఉంటాయి.
ఈ సిరీస్ గతేడాది చైనాలో విడుదల కాగా, ఈ ఏడాది భారతీయ మార్కెట్ లో విడుదలవుతున్నాయి. ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్ హైలైట్స్ ఇవే.. ఒప్పో రెనో 7 5జీ, ఒప్పో రెనో 7 5జీ ప్రో మొబైల్స్ గ్లో డిజైన్‌తో రానున్నాయి.గ్లాస్ బ్యాక్‌తో పాటు ఫోన్ సైడ్స్ ఫ్లాట్‌గా ఉంటాయి. ఇకపోతే ప్రో మోడల్‌లో సైడ్స్ మెటల్‌తో రూపొందించింది ‘ఒప్పో’ సంస్థ. ఏవియేషన్ ఇండస్ట్రీలో వినియోగించే సాంకేతితతో ఒప్పో రెనో 7 సిరీస్ ఫోన్ల బ్యాక్ ప్యానెల్స్ రూపొందంచినట్లు ఒప్పో సంస్థ తెలిపింది.
రెనో 7 ప్రో కెమెరాల సెటప్ వద్ద బ్రీథింగ్ లైట్స్ ఉంటాయి. కాల్స్, మెసేజ్‌లు వచ్చినా, చార్జింగ్ పెట్టిన సమయాల్లో ఆ లైట్లు వెలుగుతాయి. అంటే నోటిఫికేషన్ లైట్‌లా పని చేస్తుందని అర్థం. ఇలా అత్యాధునికమైన ఫీచర్స్ కలిగిన ఈ ఫోన్స్ ను ఈ కామర్స్ సంస్థల్లోనూ అవెయిలబుల్ గా ఉంటాయి. వాటితో పాటు ఒప్పో స్టర్స్ లోనూ లభిస్తాయి. ఇకపోతే ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ప్రైస్ రూ.28,000 నుంచి రూ.43,000 మధ్య ఉండే చాన్స్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్స్ బ్యాటరీ కూడా స్టాండర్డ్‌గా ఉంటుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.