Oppo Reno 7 Pro : ఒప్పో రెనో 7 5జీ సిరీస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇవే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Oppo Reno 7 Pro : ఒప్పో రెనో 7 5జీ సిరీస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇవే..

Oppo Reno 7 Pro : మొబైల్ ఫోన్స్ యూసేజ్ గతంతో పోల్చితే ఇప్పుడు చాలా పెరిగిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రతీ ఒక్కరు దాదాపుగా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఇకపోతే ఒప్పో ఫోన్స్ కూడా ఇండియాలో బాగానే సేల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే భారత కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న ఒప్పో రెనో 7 5జీ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ త్వరలో లాంచ్ కాబోతున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.ఒప్పో సంస్థ తన రెనో […]

 Authored By mallesh | The Telugu News | Updated on :24 January 2022,9:00 pm

Oppo Reno 7 Pro : మొబైల్ ఫోన్స్ యూసేజ్ గతంతో పోల్చితే ఇప్పుడు చాలా పెరిగిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రతీ ఒక్కరు దాదాపుగా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఇకపోతే ఒప్పో ఫోన్స్ కూడా ఇండియాలో బాగానే సేల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే భారత కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న ఒప్పో రెనో 7 5జీ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ త్వరలో లాంచ్ కాబోతున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.ఒప్పో సంస్థ తన రెనో 7 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్స్‌ను భారత్‌లో విడుదల చేయబోతున్నది. వచ్చే నెల 4న ఈ సిరీస్ భారతీయ మార్కెట్ లో అవెయిలబుల్ గా ఉంటాయి.

ఈ సిరీస్ గతేడాది చైనాలో విడుదల కాగా, ఈ ఏడాది భారతీయ మార్కెట్ లో విడుదలవుతున్నాయి. ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్ హైలైట్స్ ఇవే.. ఒప్పో రెనో 7 5జీ, ఒప్పో రెనో 7 5జీ ప్రో మొబైల్స్ గ్లో డిజైన్‌తో రానున్నాయి.గ్లాస్ బ్యాక్‌తో పాటు ఫోన్ సైడ్స్ ఫ్లాట్‌గా ఉంటాయి. ఇకపోతే ప్రో మోడల్‌లో సైడ్స్ మెటల్‌తో రూపొందించింది ‘ఒప్పో’ సంస్థ. ఏవియేషన్ ఇండస్ట్రీలో వినియోగించే సాంకేతితతో ఒప్పో రెనో 7 సిరీస్ ఫోన్ల బ్యాక్ ప్యానెల్స్ రూపొందంచినట్లు ఒప్పో సంస్థ తెలిపింది.

do you know oppo reno 7 pro features

do you know oppo reno 7 pro features

Oppo Reno 7 Pro : భారత్‌లో ఈ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ ఎప్పుడంటే..

రెనో 7 ప్రో కెమెరాల సెటప్ వద్ద బ్రీథింగ్ లైట్స్ ఉంటాయి. కాల్స్, మెసేజ్‌లు వచ్చినా, చార్జింగ్ పెట్టిన సమయాల్లో ఆ లైట్లు వెలుగుతాయి. అంటే నోటిఫికేషన్ లైట్‌లా పని చేస్తుందని అర్థం. ఇలా అత్యాధునికమైన ఫీచర్స్ కలిగిన ఈ ఫోన్స్ ను ఈ కామర్స్ సంస్థల్లోనూ అవెయిలబుల్ గా ఉంటాయి. వాటితో పాటు ఒప్పో స్టర్స్ లోనూ లభిస్తాయి. ఇకపోతే ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ప్రైస్ రూ.28,000 నుంచి రూ.43,000 మధ్య ఉండే చాన్స్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్స్ బ్యాటరీ కూడా స్టాండర్డ్‌గా ఉంటుంది.

 

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది