Political Leaders Salaries : ప్రజాప్రతినిధులకు ఎంత జీతం ఉంటుందో తెలుసా? ఎక్కువ జీతాలు తీసుకునే రాజకీయ నాయకులు ఎవరో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Political Leaders Salaries : ప్రజాప్రతినిధులకు ఎంత జీతం ఉంటుందో తెలుసా? ఎక్కువ జీతాలు తీసుకునే రాజకీయ నాయకులు ఎవరో తెలుసా?

Political Leaders Salaries : సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు నెలనెలా జీతం తీసుకుంటారు. కానీ.. రాజకీయ నాయకులు జీతాలు తీసుకుంటారనే విషయం మీకు తెలుసా? ప్రభుత్వ ఉద్యోగులలాగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జీతాలు తీసుకుంటారనే విషయం ఎంతమందికి తెలుసు? అసలు.. వీళ్లకు నెలనెలా జీతాలు ఎవరు ఇస్తారు? ఒక్కొక్కరి జీతం ఎంత ఉంటుంది? ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లకు జీతాలు ఇస్తారా? వాళ్లకు ఎంత జీతాలు ఉంటాయి? ఆ జీతంతో వాళ్లు ఏం […]

 Authored By prabhas | The Telugu News | Updated on :17 July 2022,6:00 pm

Political Leaders Salaries : సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు నెలనెలా జీతం తీసుకుంటారు. కానీ.. రాజకీయ నాయకులు జీతాలు తీసుకుంటారనే విషయం మీకు తెలుసా? ప్రభుత్వ ఉద్యోగులలాగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జీతాలు తీసుకుంటారనే విషయం ఎంతమందికి తెలుసు? అసలు.. వీళ్లకు నెలనెలా జీతాలు ఎవరు ఇస్తారు? ఒక్కొక్కరి జీతం ఎంత ఉంటుంది? ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లకు జీతాలు ఇస్తారా? వాళ్లకు ఎంత జీతాలు ఉంటాయి? ఆ జీతంతో వాళ్లు ఏం చేస్తారు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే దితెలుగున్యూస్ చానెల్ కు సబ్ స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఒక ఊరిలో ఉండే సర్పంచ్ దగ్గర్నుంచి..

ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి, గవర్నర్లు, రాష్ట్ర పతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులు..వీళ్లందరికీ ప్రభుత్వ ఉద్యోగుల్లా నెలనెలా లక్షలకు లక్షలు జీతాలు ఇస్తారు. అసలు వీళ్లకు జీతాలు ఎందుకు ఇస్తారు? రాజ్యాంగంలో రాజకీయ నాయకుల జీతాలకు సంబంధించి ఏదైనా రాశారా ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్యాంగంలోని శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ మినిస్టర్స్ యాక్ట్ 1954లో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరి జీతాల గురించి వివరించారు. వీళ్లకు ఇచ్చే జీతాలను కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఖాతా నుంచి చెల్లిస్తారు. అది భారతదేశం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి. దానికి డబ్బులు భారతీయులు చెల్లించే అన్ని పన్నులు మెయిన్ ఖాతాలోనే జమ అవుతాయి. ఇదే ఖాతా నుంచి రాజకీయ నాయకులకు జీతాలను చెల్లిస్తారు. వాళ్లకు జీతాలతో పాటు.. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. వాటన్నింటినీ ప్రభుత్వమే చూసుకుంటుంది. గృహ అవసరాల నుంచి వాళ్ల కుటుంబ సభ్యుల ఖర్చు, కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు, రవాణా సదుపాయం, పెన్షన్ లాంటి ఎన్నో అలవెన్సులు రాజకీయ నాయకులకు ఉంటాయి.

Do you know the Political Leaders Salaries in Video

Do you know the Political Leaders Salaries in Video

ఇలాంటి సదుపాయాలన్నీ ఎమ్మెల్యే దగ్గర్నుంచి ఆపైన పదవిలో ఉండే వాళ్లందరికీ వర్తిస్తాయి. అయితే.. మన దేశంలోని ఎమ్మెల్యేలలో అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాలు ఒకే విధంగా ఉండవు. దేశంలోనే ఎక్కువ జీతాలు తీసుకునే రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. రెండో స్థానంలో ఢిల్లీ ఉంది. తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే నెల వారి జీతం రెండున్నర లక్షలు. ఢిల్లీ ఎమ్మెల్యేల నెల జీతం రెండు లక్షల పది వేలు. త్రిపురలో ఎమ్మెల్యేలు అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల కన్నా తక్కువ జీతం 40 వేలు మాత్రమే తీసుకుంటున్నారు. ఇక.. దేశంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం కేసీఆర్. ఈయన నెల జీతం నెలకు నాలుగు లక్షలా 21 వేల రూపాయలు. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ నిలిచారు. ఆయన నెల జీతం 3 లక్షల 90 వేల రూపాయలు. మూడో స్థానంలో యూపీ సీఎం యోగి నిలిచారు. ఈయన నెల జీతం మూడు లక్షల 65 వేల రూపాయలు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఐదో స్థానంలో నిలిచారు. ఆయన నెల జీతం 3 లక్షల 35 వేల రూపాయలు. రాష్ట్రపతి జీతం నెలకు 5 లక్షలకు పైనే ఉంటుంది. ఉపరాష్ట్రపతి నెలజీతం 4 లక్షలకు పైనే ఉంటుంది. ప్రధాన మంత్రి నెలవారి జీతం 5 లక్షలు ఉంటుంది. గవర్నర్ల నెల జీతం 3 లక్షల 50 వేలు ఉంటుంది. రాజ్యాంగంలో వీళ్ల జీతాల గురించి రాసి ఉంది కానీ.. ఎవరికి ఎంత జీతం ఇవ్వాలని ఎవరు నిర్ణయిస్తారో తెలుసా? రాజకీయ నాయకులు బిల్లును లోక్ సభలో జీతాల గురించి ప్రవేశ పెడతారు. ఆ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత దాన్ని రాష్ట్రపతి ఆమోదిస్తారు. అనంతరం ఆ బిల్లులో నిర్దేశించిన ఆధారంగా జీతాలను ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తుంటారు. ఈ వీడియో మీకు ఎంతో కొంత సమాచారాన్ని అందించిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ఈ చానెల్ లో మీకోసం త్వరలో అందిస్తాం.

పూర్తి వీడియో కోసం ఇక్క‌డక్లిక్ చేయండి

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది