Coriander leaves | కొత్తి మీరని ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో లాభాలు తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Coriander leaves | కొత్తి మీరని ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో లాభాలు తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :27 August 2025,11:00 am

Coriander leaves | మన వంటగదిలో తరచూ ఉపయోగించే కొత్తిమీర ఒక్క గార్నిషింగ్‌కు మాత్రమే కాదు… దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయని తెలుసా?

కొత్తిమీరలో ఉండే ముఖ్యమైన పోషకాలు:

విటమిన్లు: A, C, E, K

ఖనిజాలు: ఐరన్‌, కాల్షియం, ఫాస్ఫరస్‌, మాంగనీస్‌

ఫైబర్: జీర్ణవ్యవస్థకు మేలు చేసే డైటరీ ఫైబర్

కెరోటినాయిడ్లు: శరీరాన్ని రోగాల నుండి రక్షించడంలో సహాయపడతాయి

లినోలెయిక్ యాసిడ్: ఇది ఓ ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్, ఆరోగ్యానికి చాలా అవసరం

#image_title

కొత్తిమీరలో ఉండే ఫైబర్ మరియు ఇతర పోషకాలు అజీర్ణం, గ్యాస్, కడుపుమంట, కడుపునొప్పి, మలబద్ధకం లాంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. ఉదయాన్నే కొత్తిమీరతో చేసిన నీరు తాగితే మలబద్ధకం సమస్య తగ్గుతుంది.కొత్తిమీరలోని సహజ గుణాలు నరాల ఒత్తిడిని తగ్గించి, మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ఇది నిద్ర సమస్యలు, ఆందోళనలకు సహజమైన పరిష్కారం.

విటమిన్ A, C, E ఉండటం వల్ల కొత్తిమీర కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కంటి చూపు బలంగా ఉండేలా చేస్తుంది.ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ దాడి నుంచి రక్షించి, ఇన్‌ఫెక్షన్లకు తలొద్దకుండా చేస్తాయి.కొత్తిమీర ఆకులు ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే, చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెంచుతాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది