Banana | ఉదయం అరటిపండు తినండి.. గుండెకు ఎంత మేలు చేస్తుందో తెలుసా?
Banana | ఈ మధ్యకాలంలో చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఆకస్మిక గుండెపోటులు, హార్ట్ ఫెయిల్యూర్ లాంటి కేసులు నిత్యం వార్తల్లో దర్శనమిస్తున్నాయి. ఇదే కారణంగా గుండె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
#image_title
ఉదయం అరటిపండు తినండి
ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం, ఉదయం 11 గంటల సమయంలో అరటిపండు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో చాలామంది బిస్కెట్లు, కేకులు వంటి చక్కెర పదార్థాలు తీసుకుంటారు. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్‌ను హఠాత్తుగా పెంచి మళ్లీ పడిపోతే శరీరంపై ప్రభావం చూపుతాయి.
కానీ అరటి పండు తింటే శక్తి నిలకడగా ఉంటుంది. ఇది బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ అధ్యయనంలోనూ నిరూపితమైంది. ఇది శరీరంలోని సోడియం స్థాయిని సమతుల్యం చేస్తూ, రక్తపోటు తగ్గిస్తుంది, తద్వారా గుండెపోటు, స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. అరటిపండులోని ఫైబర్, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. సహజ చక్కెరలు మరియు ఫైబర్ వల్ల శక్తి క్రమంగా విడుదల అవుతుంది . ఇది చక్కెర పదార్థాల వల్ల కలిగే తాత్కాలిక శక్తికన్నా బెటర్. రోజు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి వ్యాయామం చేస్తే రక్త ప్రసరణ మెరుగవుతుంది. గుండె బలపడుతుంది. శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.