Milestones : మైలు రాయిపై రంగులు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా… మైలురాయిని మీరు ఎప్పుడైనా గమనించారా…
Milestones : ప్రతిరోజు మనము రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు, కిలోమీటర్ రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. మనం ప్రయాణిస్తున్న రహదారి పక్కన కిలోమీటర్ రాళ్లపైన ఆ ఊరు పేరు. మరియు కిలోమీటర్ల అంకెలు కూడా రాసి ఉంటాయి. అది మనమందరం గమనించే ఉంటాము. అయితే మనము ఎప్పుడైనా మరొక విషయం ఆలోచించాలి.. అవి ఏమిటంటే కిలోమీటర్లు రాళ్ల అనేవి రెండు కలర్స్ లో ఉంటాయి .అయితే ఆ రాయిలో సగభాగం, వైట్ కలర్, లో ఉంటే మిగతా సగభాగం మాత్రం మరో కలర్ లో ఉంటుంది. వైట్ కలర్ అనేది కామన్ గా అన్ని రాళ్లపైన ఉంటుంది. కానీ వైట్ కలర్ కి సమానంగా వేరే కలరు మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది.
అలా కిలోమీటర్ రాళ్లు రకరకాల కలర్ లో ఉండటానికి గల కారణాలు ఏమిటి అనగా… కిలోమీటర్ రాయి పైన వైట్ తో సమానంగా ఉండే మరో కలర్ ఆ ప్రాంతాన్ని ఐడెంటిఫై చేస్తుందంట. అదేవిధంగా మనం ఉన్న ప్రాంతంలో కిలోమీటర్ రాయి పసుపు రంగులో ఉంటే మనము జాతీయ రహదారిపై ఉన్నాము అని తెలుపుతుంది. అలా కాకుండా కిలోమీటర్ రాయి పైన ఆకుపచ్చ రంగు తో ఉంటే మనము రాష్ట్ర రహదారి పైన ఉన్నాము అని తెలుపుతుంది. ఒకవేళ కిలోమీటర్ రాయి నలుపు నీలం కలరు మరియు తెలుపు రంగులో ఉంటే మనము నగరము మరియు జిల్లాలోకి ప్రవేశించినట్లు అని తెలుపుతుంది.
మరియు ఆ రహదారులు నిర్వహణ ఆ జిల్లా ప్రాంతంలోకి వస్తాయి అని సూచిస్తుంది. లేదా ఆ రహదారులు నిర్వహణ కేవలం ఆ నగర మే నిర్వహణ బాధ్యత ఉంటుంది అని తెలుపుతుంది. అలాకాకుండా కిలోమీటర్లు రాయి ఎరుపు రంగులో ఉంటే మనము గ్రామీణ రహదారిలో ప్రయాణిస్తున్నాము అని అర్థము ఈ రహదారి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ప్రాంతంలోకి వస్తుంది. ఈ కిలోమీటర్ రాళ్లపై ఉండే రంగులు ఆ యొక్క ప్రాంతాన్ని ,మరియు మనము ప్రయాణిస్తున్న రహదారి జాతీయ రహదారి, రాష్ట్రీయ రహదారి ,నగరము ,జిల్లా, గ్రామీణ, రహదారులుగా తెలియజేస్తాయి .