Drugs | మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో మైనర్ల డ్రగ్స్ పార్టీ కలకలం.. ఇద్దరికి గంజాయి పాజిటివ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Drugs | మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో మైనర్ల డ్రగ్స్ పార్టీ కలకలం.. ఇద్దరికి గంజాయి పాజిటివ్

 Authored By sandeep | The Telugu News | Updated on :6 October 2025,12:00 pm

Drugs | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ఫార్మ్ హౌస్‌లో ఆదివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెద్దమంగళారం వద్ద ఉన్న చెర్రీ ఓక్స్ ఫార్మ్ హౌస్లో నిఘా సమాచారం ఆధారంగా పోలీసులు రైడ్ నిర్వహించారు. ఇందులో విద్యార్థులే పాల్గొనడం పోలీసులను కూడా షాక్‌కు గురి చేసింది.

#image_title

50 మంది ఇంటర్ విద్యార్థులు

పార్టీలో మొత్తం 50 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 14 మంది బాలికలు కూడా ఉన్నారు. వారింతా ఇంటర్ చదువుతున్న మైనర్లు కావడం గమనార్హం. పోలీసులు వారందరినీ మెడికల్ టెస్ట్‌కు పంపించగా, ఇద్దరికి గంజాయి సేవించినట్లు రిపోర్ట్ వచ్చింది. డ్రగ్స్ పార్టీకి కేంద్ర బిందువైన వ్యక్తి కిషన్ అనే ఇంటర్ విద్యార్థి. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో “ట్రాప్ హౌస్” పేరుతో పార్టీ ప్రచారం చేసి, ఒక్కో వ్యక్తి నుంచి రూ.1600 చొప్పున వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియా వేదికగా మైనర్లను ఆకర్షించి ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.రాజేంద్రనగర్ SOT పోలీసులు సంఘటనా స్థలాన్ని పూర్తిగా తనిఖీ చేసి, 8 మద్యం బాటిళ్లు, గంజాయి ప్యాకెట్లు, డ్రగ్స్‌కు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఫార్మ్ హౌస్ యజమాని సహా మరొక నలుగురిపై కేసులు నమోదు చేశారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది