Drumstick Leaves : మునగాకు గురించి ఎంత మందికి తెలుసు. మునగ చెట్టు తెలుసు కదా. ఆ చెట్టు మొత్తం ఔషధాల గని. చెట్టు కాండం, ఆకు, కాయలు అన్నీ ఔషధ గుణాలు ఉన్నవే. దేంట్లో లేని ఆయుర్వేద గుణాలు మునగాకులో ఉంటాయి. అందుకే మునగాకుకు అంత డిమాండ్. పల్లెటూర్లలో అంటే మునగ చెట్లు ఉంటాయి కానీ.. మునగ చెట్లు పట్నాల్లో ఎక్కడ కనిపిస్తాయి. అందుకే మునగాకు దొరక్కపోయినా మునగకాయలను కొనుక్కొని కూరలో వేసుకుంటున్నాం. కానీ.. మునగకాయ కంటే కూడా మునగ ఆకు చాలా మంచిది.
మునగ ఆకులో ఉండని విటమిన్ ఉండదు. సాధారణంగా ఒక్కో కూరగాయ, పండులో ఒక్కో విటమిన్ ఉంటుంది. అన్ని విటమిన్స్ కావాలంటే ఖచ్చితంగా అన్ని పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. కానీ.. అవేవీ తీసుకోకుండా.. ఒక్క మునగాకును తీసుకుంటే చాలు అన్ని రకాల విటమిన్స్ మనకు అందుతాయి. మునగాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మగవాళ్లకు మునగాకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. మగవారిలో ఉండే టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతుంది. మునగాకును ఏ విధంగా అయినా మనం వాడుకోవచ్చు.
అంటే.. ఆకుల రూపంలో, పేస్ట్ రూపంలో, రసం రూపంలో, ఇంకా చెప్పాలంటే ఆకుని ఎండబెట్టి పొడి చేసుకొని ఆ పౌడర్ ను కూడా మనం వినియోగించుకోవచ్చు. మునగాకుతో టీ తయారు చేసుకొని తాగుతూ ఉంటే చాలా రోగాలు నయమైపోతాయి. మందులు కూడా అవసరం లేకుండా అంత చక్కగా మన ఆరోగ్యం మెరుగు అవుతుంది. పేగుల్లో నిలువ ఉండే కొవ్వులను కూడా తొలగించేస్తుంది మునగాకు. అలాగే.. స్థూలకాయంతో బాధపడేవాళ్లు కూడా మునగాకు టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మునగాకు టీ తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్టరాల్ తగ్గి మంచి కొలెస్టరాల్ పెరుగుతుంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.