Dry Fish Curry : ఈ ఎండు చేపల పులుసు ఒక్కసారి తిన్నారంటే చాలు… మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dry Fish Curry : ఈ ఎండు చేపల పులుసు ఒక్కసారి తిన్నారంటే చాలు… మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది…

Dry Fish Curry : ఎండు చేపలు అంటే చేపలను పట్టిన తర్వాత వాటిని ఎండబెడతారు. ఇలా ఎండబెట్టిన వాటిని ఎండు చేపలు అంటారు. వీటిలో చాలా రకాలు ఉంటాయి. పెద్ద చేపలు, ఉప్పు చేపలు, రొయ్యలు, కడ్డీలు, ఇలా చాలా రకాలు ఉంటాయి. అయితే ఇలాంటి చేపలను కొందరు ఇష్టపడరు, కొందరు మాత్రం చాలా ఇష్టపడుతుంటారు. అయితే మనం ఇప్పుడు అందరూ ఇష్టపడేలా చేసుకుందాం. ఈ చేపల పులుసుని, దీనిని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :18 July 2022,8:20 am

Dry Fish Curry : ఎండు చేపలు అంటే చేపలను పట్టిన తర్వాత వాటిని ఎండబెడతారు. ఇలా ఎండబెట్టిన వాటిని ఎండు చేపలు అంటారు. వీటిలో చాలా రకాలు ఉంటాయి. పెద్ద చేపలు, ఉప్పు చేపలు, రొయ్యలు, కడ్డీలు, ఇలా చాలా రకాలు ఉంటాయి. అయితే ఇలాంటి చేపలను కొందరు ఇష్టపడరు, కొందరు మాత్రం చాలా ఇష్టపడుతుంటారు. అయితే మనం ఇప్పుడు అందరూ ఇష్టపడేలా చేసుకుందాం. ఈ చేపల పులుసుని, దీనిని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.దీనికి కావలసిన పదార్థాలు: ఎండు చేపలు, చిక్కుడు గింజలు, వంకాయలు, ములక్కాయలు, కంద ము, పసుపు, కారం, ఉప్పు గరం మసాలా, చింతపండు పులుసు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతులు, ఆవాలు, కొత్తిమీర, ఆయిల్ మొదలైనవి.

దీని తయారీ విధానం: ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకొని దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్, వేసుకొని దానిలో పచ్చిమిర్చి నాలుగు చీలికలు తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు ముక్కలు సన్నగా తరిగినవి, తరువాత ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి వంకాయలు అలాగే ములక్కాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత దీనిలో కంద ముక్కలను, ఒక ఆరు ముక్కలు వేసుకోవాలి. వీటిని ఒక పది నిమిషాలు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. తర్వాత వీటిలో ఒక కప్పు టమాటా ముక్కలను, వేసుకోవాలి. తర్వాత పది నిమిషాల వరకు టమాటాలు మెత్తపడే వరకు ఉడకనివ్వాలి.

Dry Fish Curry you will want to eat it again and again

Dry Fish Curry you will want to eat it again and again

తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల కారం, రెండు స్పూన్ల ఉప్పు, వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత దీనిలో చింతపండు రసం పోసుకోవాలి. అలాగే ఒక పావు లీటర్ నీటిని కూడా పోసుకోవాలి. మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తరువాత శుభ్రపరిచిన చేపలను తీసుకొని దానిలో ఒక ఐదు ఆరు వరకు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 15 నిమిషాల వరకు, అంటే నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దింపే ముందు కొత్తిమీర ను చల్లుకొని దింపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చేపల పులుసు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది