ECIL Apprentice : ECIL అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్.. 187 ఖాళీలు
ప్రధానాంశాలు:
ECIL Apprentice, Electronics Corporation of India Limited, ECIL, Hyderabad
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్ (GEA) మరియు డిప్లొమా అప్రెంటీస్‌ల నియామకానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 187 గ్రాడ్యుయేట్/ డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు…
వివరాలు :
1. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ : 150 ఖాళీలు
2. డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటిస్ : 37 ఖాళీలు
మొత్తం ఖాళీల సంఖ్య : 187.
ఇంజినీరింగ్ బ్రాంచ్ : ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, ఈఈఈ, ఈఐఈ.
అర్హత : సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి : 31.12.2024 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు.
స్టైపెండ్ : నెలకు జీఈఏలకు రూ.9000, టీఏ అభ్యర్థులకు రూ.8000.
శిక్షణ కాలం : ఒక సంవత్సరం.

ECIL Apprentice : ECIL అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్.. 187 ఖాళీలు
ఎంపిక విధానం : డిప్లొమా, బీఈ, బీటెక్ పరీక్షల్లో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్థలం : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్ రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్.
ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ప్రారంభం : 20.11.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 01.12.2024.
ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి : 04.12.2024.
ధ్రువపత్రాల పరిశీలన తేదీలు : 09, 10, 11.12.2024
ప్రవేశానికి గడువు తేదీ : 31.12.2023.
అప్రెంటిస్‌షిప్ శిక్షణ ప్రారంభం : 04.12.2024.