ECIL Project Engineer : ఈసీఐఎల్‌లో 61 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం ….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ECIL Project Engineer : ఈసీఐఎల్‌లో 61 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం ….!

 Authored By ramu | The Telugu News | Updated on :4 November 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  ECIL Project Engineer : ఈసీఐఎల్‌లో 61 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం ....!

ECIL Project Engineer : ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ & జూనియర్ టెక్నీషియన్ ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నవంబర్‌ 4, 5, 7, 11వ తేదీల్లో నిర్వహించే వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

ECIL Project Engineer ఖాళీల వివరాలు

1. ప్రాజెక్ట్ ఇంజినీర్: 20 పోస్టులు
2. టెక్నికల్ ఆఫీసర్: 26 పోస్టులు
3. ఆఫీసర్: 02 పోస్టులు
4. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ అండ్‌ అసిస్టెంట్ ఇంజినీర్ : 13 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య : 61.
అర్హత : సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనాలు : నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.45,000 నుంచి రూ.55,000. టెక్నికల్ ఆఫీసర్‌/ ఆఫీసర్‌కు రూ.25,000 నుంచి రూ.31,000. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.24,500 నుంచి రూ.30,000.
ప్రాజెక్ట్ లొకేషన్ : ఈస్ట్ జోన్ (కోల్‌కతా), నార్త్ జోన్ (న్యూదిల్లీ), వెస్ట్ జోన్ (ముంబయి), హెడ్ క్వార్టర్స్ (హైదరాబాద్).

ECIL Project Engineer ఈసీఐఎల్‌లో 61 ప్రాజెక్ట్ ఇంజినీర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

ECIL Project Engineer : ఈసీఐఎల్‌లో 61 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం ….!

ఎంపిక విధానం : విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు : 04, 05, 07, 11-11-2024.
వేదిక : హైదరాబాద్, ముంబయి, న్యూదిల్లీ, కోల్‌కతాలోని ఈసీఐఎల్‌ కార్యాలయాల్లో.

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది