Earphones : ఇయర్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా… అయితే ఇది మీ కోసమే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Earphones : ఇయర్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా… అయితే ఇది మీ కోసమే…!

Earphones : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను చూస్తున్నారు. ఫోన్ లో కాల్స్ మాట్లాడడం కంటే ఎక్కువగా అందులో ఉండే ఫీచర్స్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఎక్కువమంది మ్యూజిక్ వినడానికి బయటికి సౌండ్ వస్తే ఇతరులకు ఇబ్బందిగా ఉంటుందని భావించి ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు. జర్నీ చేసేటప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు టైం పాస్ కోసం మ్యూజిక్ వింటూ ఉంటారు. అయితే ఇయర్ ఫోన్స్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :25 October 2022,6:40 am

Earphones : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను చూస్తున్నారు. ఫోన్ లో కాల్స్ మాట్లాడడం కంటే ఎక్కువగా అందులో ఉండే ఫీచర్స్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఎక్కువమంది మ్యూజిక్ వినడానికి బయటికి సౌండ్ వస్తే ఇతరులకు ఇబ్బందిగా ఉంటుందని భావించి ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు. జర్నీ చేసేటప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు టైం పాస్ కోసం మ్యూజిక్ వింటూ ఉంటారు. అయితే ఇయర్ ఫోన్స్ ను పరిమితంగా వాడితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అలా కాకుండా ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా వాడుతున్న వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో వినికిడి సమస్యతో పాటు మరిన్ని సమస్యలతో ఇబ్బంది పడతారు.

ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్, ఎయిర్ ప్యాడ్, బ్లూటూత్ తో ఫోన్లో ఎక్కువ మాట్లాడడం ఎక్కువ సౌండ్ తో పాటలను వినడం వలన అది వినికిడి పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజంతా వీటిని ఉపయోగించడం వలన చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందట. ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తే చెవులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. వీటిని ఎక్కువగా వాడితే ఇన్ఫెక్షన్లు వస్తాయి. చెవిలో నొప్పికి కారణం అవుతుంది. క్రమంగా ఈ సమస్య పెరిగి నొప్పి తర్వాత చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. కొందరికి తల కూడా తిరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇతరుల ఎయిర్ ఫోర్స్ బదులుగా హెడ్ ఫోన్లు ఉపయోగించడం వలన పెద్దగా ఇబ్బందులు ఉండవంటున్నారు.

Effects of earphones

Effects of earphones

చెవి మీద హెడ్ ఫోన్ పెట్టుకోవడం వలన సౌండ్ కు కర్ణభేరి మధ్య గ్యాప్ ఉంటుంది. దీంతో చెవి పై పెద్దగా ప్రభావం ఉండదని చెబుతున్నారు. ఇయర్ ఫోన్స్ ఉపయోగించేటప్పుడు సౌండ్ తక్కువగా పెట్టుకోవాలి. వాల్యూమ్ 60 డేసిబెల్స్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ ఉంటే వినికిడి లోపం వస్తుంది. ఫోన్ సెట్టింగ్ లో వాల్యూమ్ 50% ఉంచుకోవాలి. దీంతో సౌండ్ చేసే ప్రయత్నం చేస్తే వార్నింగ్ వస్తుంది. అలాంటప్పుడు సౌండ్ లిమిట్లోనే పెట్టుకొని మ్యూజిక్ వినవచ్చు. ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడేవారు ఈ జాగ్రత్తలను తీసుకోవడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు. సౌండ్ ఎక్కువగా పెట్టుకుని వింటే మాత్రం త్వరగా వినికిడి సమస్యలు వస్తాయి అని హెచ్చరిస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది