Earphones : అతిగా ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే..!!
Earphones : ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారు.. ఇది అతిగా వాడుతున్నట్లయితే ఆరోగ్యం డేంజర్లు పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నట్లయితే వినికిడి సమస్యలు ఉన్నట్లే.. ఈ సమస్య తీవ్రం అవ్వకముందే వైద్య నిపుణులు సంప్రదించాలి.. ఇయర్ ఫోన్స్ అనేవి ఇది శరీరంలో భాగంగా మారిపోతున్నాయి. అవి చెవులకు లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ చాలా మందికి కలుగుతుంది. చివరికి దగ్గరగా పెట్టుకొని శబ్దాలు వినడం వలన కారణ వీరిపై ఒత్తిడి పెరిగి వినికిడి సమస్యలు వస్తున్నాయి. అలాగే ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా ఇవి కారణమవుతున్నాయి. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్
అండ్ రీచర్చ సంస్థ లోతుగా ఆ పరిశోధన చేసింది. యువతలో ఏర్పడుతున్న వినికిడి సమస్యలు ముఖ్య కారణం ఇయర్ ఫోన్స్ అతిగా వాడడం అని తెలిపారు. వీటిని ఎక్కువగా వాడుతున్నట్లయితే సమస్య పెరుగుతుందని నిర్ధారించడం జరిగింది. నిజానికి 50 ఏళ్ల తర్వాత సహజంగా వినికిడి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు 20 ఏళ్ల వయసులోనే ఈ సమస్యలు వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం చిన్న వయసు నుంచి శబ్దానికి విపరీతంగా అలవాటుగా మార్చుకోవడం. వచ్చిన తర్వాత ఈ సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. అయితే ఈ ఇయర్ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న రోజులలో నలుగురిలో వినికిడి సమస్యలు వస్తున్నాయి. అది కూడా ఎక్కువగా యువతలో ఈ సమస్య తీవ్రంగా వస్తున్నాయి. చెవిలో సమస్యలు రావడం దురదగా
అనిపించడం ఏదో నొప్పిగా ఉండడం లాంటి సంకేతాలు కనిపిస్తే వాటిని వినికిడి సమస్యలుగా చెప్పడానికి తొలి లక్షణంగా తెలుసుకోవచ్చు. తాజాగా వస్తున్న హైటెక్ ఇయర్ ఫోన్స్ కొత్తగా మెరుగ్గా ఉన్న ప్రమాదం లేదని చెప్పలేమని చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మంది యువకులు ఉన్నవారికి ఈ సమస్యలు రావచ్చని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద 43 కోట్ల మంది చెవిటితనంతో ఇబ్బంది పడుతున్నారని ఈ పరిశోధనలో బయటపడింది. భారతదేశంలో దాదాపు 60 లక్షల మందికి వినికిడి సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. ఇయర్ ఫోన్స్ అదిగా వాడే అలవాటు ఉంటే ఇప్పటినుంచైనా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అరగంట సేపు వాటిని వాడాలంటే ఆ తర్వాత ఒక పది నిమిషాలు మీ చెవులకి బ్రేక్ ఇవ్వాలి.. లేదంటే మీ ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం..