Electric Scooter : మార్కెట్ లోకి మరో స్కూటర్.. లెటెస్ట్ ఫీచర్స్ తో లాంచ్.. భద్రతపై స్పెషల్ ఫోకస్
Electric Scooter : ప్రస్తుతం ఈ వెహికిల్స్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. పెరుగుతున్న పెట్రో డీజిల్ ధరలు సామాన్యులకు తలనొప్పిగా మారాయి. చాలీచాలని జీతాలతో ఫ్యామిలీని నెట్టుకొస్తుంటే చమురు ధరలు పెరగడంతో మింగుడుపడటం లేదు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ వెహికిల్స్ పై ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ఇస్తుండటంతో మరింత డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యలోనే ఎలక్ట్రిక్ వెహికిల్స్ మధ్య పోటీ పెరిగిపోయింది. లెటెస్ట్ ఫీచర్స్ తో పలు కంపనీలు ఈ వెహికిల్స్ ని లాంచ్ చేస్తున్నాయి. అయితే పోటీ మార్కెట్ లోకి ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ స్కూటర్ దూసుకొస్తోంది.ప్రముఖ ఈ వెహికిల్స్ కంపనీలకు పోటీగా అన్ని ఫీచర్స్ తో బ్యాటరీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఈ స్కూటర్ ని లాంచ్ చేసింది.
ఈ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే 132 కి.మీ ప్రయాణించవచ్చని సదరు కంపెనీ చెప్తోంది. ఇది ప్రముఖ ఓలా, హీరో, ఒకినావా, ప్యూర్ ఈవీ వంటి కంపెనీలతో పోటీపడనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ స్కూటర్ ధర భారత్ లో రూ. 89,600 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ తో మరింత తగ్గింపు ధరకే అందుబాటులోకి రానుంది. మెటల్ ప్యానెల్ తో తయారు చేయబడిన ఈ స్కూటర్ లుకాస్ టీవీఎస్ ఎలక్ట్రిక్ మోటార్, 3.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో పనిచేయనుంది. అలాగే ఎకో, కంఫర్ట్, స్పోర్ట్, రివర్స్, పార్కింగ్ వంటి ఐదు రైడింగ్ మోడ్ లతో మార్కెట్ లోకి విడుదల చేశారు.ఈ స్కూటర్ గరిష్టంగా 65 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్తుందని సదరు కంపనీ వెల్లడించింది.

Electric Scooter Launch with the latest features
Electric Scooter : ఐదు రైడింగ్ మోడ్ లతో..
ఈ స్కూటర్‌లో ఏఐఎస్ 156 ఆమోదించిన 3.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అమర్చబడింది. బ్లూటూత్ కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ స్పీడోమీటర్ విత్ టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లతో లాంచ్ చేశారు. అంతే కాకుండా రైడింగ్ సమయంలో కాల్ అలర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. కనెక్ట్ చేయబడిన డ్రైవ్ ఫీచర్స్ సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌లను గుర్తించడంలో హెల్ప్ అవుతుంది. అయితే బ్యాటరీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఈ స్కూటర్ కి అన్ని టెస్ట్ లు చేసినట్లు తెలిపింది. ఈ స్కూటర్ని టెస్టింగ్ సమయంలో సుమారు ఒక లక్ష కిలోమీటర్లు రన్ చేసినట్లు చెప్తోంది. తరచూ ఈ వెహికల్స్ లో ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్న నేపథ్యంలో మరింత భద్రత చర్యలు తీసుకున్నట్లు సదరు కంపెనీ వెల్లడించింది.