Electric Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. చేతిలో డబ్బులు లేవా.. అయితే ఈ శుభవార్త మీకే !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Electric Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. చేతిలో డబ్బులు లేవా.. అయితే ఈ శుభవార్త మీకే !!

Electric scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే అతి తక్కువ వడ్డీ రేటుకి లోన్ పొందవచ్చు దాని ద్వారా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే వర్తించవచ్చు. అందువల్ల మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ప్లానింగ్ లో ఉంటే ఈ ఆఫర్ గురించి తెలుసుకోవడం మంచిది. ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీ అయినా హీరో మోటో కార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్లను […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 July 2023,9:10 pm

Electric scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే అతి తక్కువ వడ్డీ రేటుకి లోన్ పొందవచ్చు దాని ద్వారా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే వర్తించవచ్చు. అందువల్ల మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ప్లానింగ్ లో ఉంటే ఈ ఆఫర్ గురించి తెలుసుకోవడం మంచిది. ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీ అయినా హీరో మోటో కార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తుంది. ఈ కాలంలోనే ఈ కంపెనీ వినియోగదారులను ఆకర్షించేలా అతి తక్కువ వడ్డీ రేటుకే లోన్ అందిస్తూ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తుంది. ఈ కంపెనీ మార్కెట్లోకి విదా బ్రాండ్ కింద రెండు రకాల వేరియంట్లను తీసుకువచ్చింది.

హీరో విదా వి1 ప్రో, హీరో విదా వి1 ప్లస్ అనేవి వచ్చాయి. తక్కువ వడ్డీ రేటుకి రుణం పొందవచ్చు. హీరో విదా వీ1 ప్రో ధర రూ. 1.45 లక్షలుగా ఉంది. అలాగే విదా వీ1 ప్లస్ ధర రూ. 1.2 లక్షలుగా ఉంది. ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయడానికి కేవలం 5.99% నుంచి వడ్డీ రేటుకే రుణం పొందవచ్చు. అలాగే నెలవారి ఈఎంఐ 2,499 నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా లోన్స్ పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే ఈ ఆఫర్ ని సొంతం చేసుకోవచ్చు.

Electric scooter offer low intrest loan

Electric scooter offer low intrest loan

హీరో విదా వీ1 ప్రో స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 110 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇంకా 0 నుంచి 80 శాతం బ్యాటరీ కేవలం 65 నిమిషాల్లోనే ఫుల్ అవుతుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.2 సెకన్లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇంకా ఇందులో కీలెస్ ఎంట్రీ, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఎల్ఈడీ లైట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అందుకే తక్కువ వడ్డీ రేటుతో లోన్ తీసుకొని ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారు ఈ ఆఫర్ ను ఒకసారి పరిశీలించండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది