Etela Rajender : నిన్న భట్టి విక్రమార్క.. ఇవాళ మరో సీనియర్ నేతతో ఈటల భేటీ.. కాంగ్రెస్ లో చేరిక ఖాయం అయినట్టే?
Etela Rajender : ఈటల రాజేందర్ గురించే ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్. ఓవైపు కరోనా తీవ్రంగా విజృంభిస్తున్నా.. కరోనా కన్నా ఎక్కువగా ఈటల గురించే తెలంగాణ ప్రజలు చర్చిస్తున్నారు. ఆయన్ను ఏకాకిని చేయడం.. మంత్రివర్గం నుంచి తీసేయడం.. భూకబ్జా ఆరోపణలు చేయడం అన్నీ ఒక్కసారిగా కన్నుమూసి తెరిచేలోగా జరిగిపోయాయి. దీంతో ఈటల వర్గంతో పాటు అంతా ఆశ్చర్యపోయారు. అసలు.. తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు. చివరకు ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించడం.. అంతకుముందే.. ఆయన వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ బదిలీ చేసుకోవడం.. అన్నీ గమనించిన తెలంగాణ ప్రజలు.. ఈటలపై టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టిందని అర్థమయింది. అయితే.. ప్రస్తుతం ఈటల హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి.. ఆయన టీఆర్ఎస్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? లేక వేరే పార్టీలో చేరుతారా? లేదంటే కొత్త పార్టీ పెడతారా? అనే మీమాంశలో అందరూ ఉన్నారు.
ఈటల రాజేందర్.. బీజేపీలో చేరుతున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఆయన కేంద్ర మంత్ర కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోనూ భేటీ అయ్యారంటూ వార్తలు వచ్చినా.. వాటిలో నిజం కనిపించలేదు. అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఆ తర్వాత ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడుతున్నారని.. ఆయన అనుచరులు కొత్త పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని వార్తలు వచ్చినా.. అవి కూడా గాసిప్స్ గానే మిగిలిపోయాయి. అయితే.. గత రెండు రోజుల నుంచి ఈటల చేస్తున్న పని చూస్తుంటే.. ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి.
Etela Rajender : కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీనివాస్ తో ఈటల భేటీ
నిన్న మే 11న ఈటల రాజేందర్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయిన విషయం తెలిసిందే. వాళ్లిద్దరూ సీక్రెట్ గా బేటీ అయ్యారు. హైదరాబాద్ లోని భట్టీ ఇంట్లో.. ఈటల భేటీ అయ్యారు. దీంతో ఈటల రాజేందర్.. ఖచ్చితంగా కాంగ్రెస్ లో చేరుతారు.. అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం… ఈటల రాజేందర్.. డీఎస్ తనయుడు, బీజేపీ ఎంపీ అరవింద్ తో భేటీ అయ్యారు ఈటల.
తాజాగా… రాజ్యసభ ఎంపీ డీ శ్రీనివాస్ తో ఈటల భేటీ అయ్యారు. వీళ్లు ఇద్దరూ కలిసి దాదాపు గంటన్నర పాటు చర్చించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తు రాజకీయాలపై ఇద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. అయితే.. అసలు.. ఈటల నిన్న భట్టితో ఏం మాట్లాడారు.. ఇవాళ డీశ్రీనివాస్ తో ఏం మాట్లాడారు అనే దానిపై స్పష్టత లేరు. డీ శ్రీనివాస్ మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ తన సొంత పార్టీ కాంగ్రెస్ కే మద్దతు పలుకుతున్నారు. ఇలా వరుసగా.. కాంగ్రెస్ నేతలతో ఈటల రాజేందర్ భేటీ అవుతుండటంతో ఈటల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని.. అందుకే.. ఈ సంప్రదింపులు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే ఈటల నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సిందే.