Etela Rajender : ఈట‌ల ప్లాన్ ఇది.. సంచలన నిజాలు బయటపెట్టిన బండి సంజయ్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Etela Rajender : ఈట‌ల ప్లాన్ ఇది.. సంచలన నిజాలు బయటపెట్టిన బండి సంజయ్..?

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 June 2021,5:46 pm

Etela Rajender : ఈటల రాజేందర్ త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారు. ఇది కన్ఫమ్ న్యూస్. ఎందుకంటే.. ఇటీవలే ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. పలువురు బీజేపీ నేతలతో చర్చించారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు కూడా అదే చెబుతున్నారు. త్వరలోనే బీజేపీలో ఈటల చేరబోతున్నారని బహిరంగంగానే చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అదే చెప్పారు. మరో వారం రోజుల్లో ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని ఆయన స్పష్టం చేశారు. అయితే.. ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్న అంశం ఏంటంటే.. ఈటల రాజేందర్.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరుతారా? లేక రాజీనామా చేయకుండా.. బీజేపీలో చేరుతారా? అనేదే. మరో విషయం ఏంటంటే.. అసలు.. ఈటలకు బీజేపీ నేతలు ఏం ఆఫర్ చేశారు? ఏ పదవి ఇస్తున్నారు? అనేది. అయితే.. వీటన్నింటికి బండి సంజయ్ ఫుల్లు క్లారిటీ ఇచ్చేశారు.

etela rajender new plan revealed by bandi sanjay

etela rajender new plan revealed by bandi sanjay

Etela Rajender : ఈటల రాజేందర్ కు మేము ఏ పదవీ ఆఫర్ చేయలేదు

అయితే.. ఈటల రాజేందర్ పార్టీ మార్పు విషయంపై బండి సంజయ్ తాజాగా స్పందిస్తూ… ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవి రాజీనామా విషయమై న్యాయ నిపుణులతో  చర్చిస్తున్నారు. దాని తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటారు. అయితే.. బీజేపీలో మాత్రం ఈటల ఎటువంటి పదవీ ఆఫర్ చేయకున్నా.. ఎటువంటి హామీ ఇవ్వకున్నా చేరుతున్నారు. కేవలం.. బీజేపీ మీద ఉన్న నమ్మకంతో ఆయన పార్టీలో చేరుతున్నారు. బీజేపీలో చేరాలని ఈటల రాజేందర్ నిర్ణయించుకున్నారు. దాని గురించే ఆయన ప్రస్తుతం న్యాయ సలహాలు తీసుకుంటున్నారు.. అని బండి సంజయ్ తెలిపారు.

etela rajender new plan revealed by bandi sanjay

etela rajender new plan revealed by bandi sanjay

Etela Rajender : మంత్రివర్గం నుంచి ఈటలను తప్పించిన కేసీఆర్.. పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయలేదు?

అయితే.. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పించారు సీఎం కేసీఆర్. అంతవరకు బాగానే ఉంది కానీ.. పార్టీ నుంచి మాత్రం సస్పెండ్ చేయలేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే.. వెంటనే ఈటల వేరే పార్టీలోకి వెళ్తారని ముందే ఊహించిన కేసీఆర్.. ఈటలను పార్టీ నుంచి మాత్రం సస్పెండ్ చేయకుండా చేశారు.. అనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. ఒకవేళ ఈటల ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా బీజేపీలో చేరితే ఏం చేయాలి? తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా? లేక స్పీకర్ ఈటలపై చర్యలు తీసుకుంటారా? అనేది హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్.. ఇద్దరూ తమదైన శైలిలో.. రాజకీయ ఎత్తుగడులు వేస్తున్నారు. ఇందులో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది