Ys jagan : ఏపీలో సరికొత్త రాజకీయం.. ఇక జగన్‌కు ఇబ్బందులు తప్పవా..?
ys jagan : చంద్రబాబు ఏడుపు ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఇన్నాళ్లు అధికారి పార్టీ వైఎస్ఆర్ సీపీ, టీడీపీ అన్నట్లుగా ఉన్న పాలిటిక్స్ రూట్ మార్చి కుల రాజకీయంగా మారాయి. అసెంబ్లీ గడప తొక్కని అని శపధం చేసి వచ్చిన చంద్రబాబు.. మీడియా ముఖంగా ఏడ్చి ఏపీ రాజకీయాల్లో మరో కొత్త అంకానికి తెర లేపారు. భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యల వల్ల ఓకే సామాజిక వర్గంలో రెండు వర్గాలుగా మారాయి. మరోవైపు బిజినెస్ లను ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు ఏడుపు, కొడాలి నాని, వల్లభనేని వంశీల వ్యాఖ్యాలు ప్రధానంగా కమ్మ సామాజిక వర్గంలో చీలికలు వచ్చేలా చేసింది.
ఏపీలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నది. వ్యాపారంలోనూ రాజకీయంగానూ రెడ్డిలతో పోటీపడుతున్నారు. కానీ ఆ కమ్మ కులం నుంచి ఇప్పటి వరకు నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పని చేశారు. గతంలో ఎలా ఉన్నా ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కుతున్నారనే ఆరోపణలు ఆ కులస్తుల నుంచి వినిపిస్తోంది. ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం జగన్‌కు అండగా నిలిచినా.. అమరావతి తరలింపు, కమ్మ కాంట్రాక్టర్లకు బిల్లుల నిలుపుదల చేస్తూ వ్యాపారాలనే కాకుండా రాజకీయంగా అణగదొక్కుతున్నారని పేర్కొంటున్నారు.
ys jagan : ఇక ప్రత్యక్ష, పరోక్ష యుద్ధమేనా..?
మరోవైపు అధికార పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నాయకులు, మంత్రులతో ప్రతిపక్షంలో ఉన్న అదే సామాజిక వర్గం నేతలపై తీవ్ర విమర్శలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకు భువనేశ్వరిపై అసభ్యకర వ్యాఖ్యలే ఉదాహారణ అని చూపుతున్నారు. అయితే ఇలాగే సైలెంట్ గా ఉంటే కమ్మ సామాజిక వర్గం ప్రమాదంలో పడే అవకాశం ఉందని భావించిన ఆ కులస్తులు ప్రత్యేక్ష, పరోక్ష యుద్ధానికి రెడీ అవుతున్నారు. వారికి జనసేన నేత పవన్ కళ్యాణ్ మద్దతు పలకడంతో జగన్ పై పోరుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడే మేల్కొనకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం కష్టమని, మళ్లీ సీఎం కుర్చీ చేజారితే తమ వ్యాపారాలతోపాటు రాజకీయ ప్రస్థానం కూడా ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదంలో ఉన్నట్లు కమ్మ సామాజిక వర్గం భావిస్తోంది.