మొగుడ్ని వదిలేసి మరిదిని తగులుకుంది… వాడు లేకపోతే బతకలేను అంది .. ఆఖర్లో ట్విస్ట్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

మొగుడ్ని వదిలేసి మరిదిని తగులుకుంది… వాడు లేకపోతే బతకలేను అంది .. ఆఖర్లో ట్విస్ట్ !

 Authored By aruna | The Telugu News | Updated on :5 June 2023,7:00 pm

ప్రస్తుతం సమాజం ఎటు పోతుందో కూడా అర్థం కావడం లేదు. పెళ్లి అయినవాళ్ళు , కాని వాళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కామ వాంఛ తీర్చుకోవడం కోసం వేసే తప్పటడుగుతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. తాజాగా ఓ మహిళ వయసులో తనకంటే చిన్నవాడైన మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడిని పెళ్లి చేసుకోవాలని ఆశ పడింది. అయితే చివరకు ఊహించని ఘటన జరిగింది. రాజస్థాన్ లో తన బంధువు పెళ్లికి వెళ్ళిన మైనా కన్వర్ అనే మహిళ హత్యకు గురైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు.

ఘటనా స్థలానికి బైక్ వచ్చి వెల్లినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలోనే మైనా కాల్ డేటా వివరాలను బయటకు తీశారు. మైనా మే 23న రాత్రి ఫోన్ మాట్లాడినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయినట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఆమె మరిది దీపక్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. మైన కన్వర్ కు ఇద్దరు పిల్లలు. ఆమె భర్త ముంబైలో పని చేస్తున్నాడు. పిల్లల చదువుల కోసం తల్లి ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే మైనాకు ఆమె మరిది దీపక్ కు మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. మూడేళ్లు ఎలాంటి ఆటంకం లేకుండా వివాహేత సంబంధం కొనసాగించారు.

Extra affair brother in law In rajasthan

Extra affair brother in law In rajasthan

భర్త ఇద్దరు పిల్లలు ఉన్న మైనా తన మరిదిని ఇష్టపడింది. భర్తను వదిలేసి మరిది తోనే కలిసి జీవనం సాగించాలని అనుకుంది. తనకన్నా వయసులో 8 ఏళ్లు చిన్నవాడని తెలిసి కూడా అతడిని కావాలని అనుకుంది. ఈ క్రమంలోనే దీపక్ ను చాలా కాలంగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుంది. ఈ విషయంపై మే 23న రాత్రి దీపక్ మైనా మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఆవేశానికి గురైన దీపక్ తన వదిన గొంతు నులిమి చంపేశాడు. తర్వాత ఏమీ తెలియనట్లు ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఫోన్ కాల్ ఆధారంగా నేరం చేసింది దీపక్ అని పోలీసులు నిర్ధారించారు.

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది