Fact Check : ఫ్యాక్ట్‌ చెక్‌ ఏపీలో ఇస్తున్న రేషన్ బియ్యం పుకార్ల పై క్లారిటీ

Fact Check : గత కొన్న రోజులుగా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ఇస్తున్న బియ్యం మరియు ఇతర సరుకుల విషయంలో కొన్ని మీడియా సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా బియ్యం క్వాలిటీ విషయమై పెద్ద ఎత్తున చర్చ నిర్వహిస్తూ ప్రజల్లో అభద్రతా భావం కల్పించడంతో పాటు పలు అనుమానాలు కలిగేలా చేస్తున్నారు. ఈ సమయంలో రేషన్‌ బియ్యం విషయంలో వస్తున్న విమర్శలపై ప్రజా పంపిణీ వ్యవస్థ ఉన్నతాధికారులు స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలకు ఫ్యాక్ట్‌ చెక్‌ ను సాక్ష్యాలతో సహా చూపించారు.2019 సంవత్సరం ముందు వరకు రాష్ట్రంల్ 1.39 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో ఆ సంఖ్య 1.45 కోట్లకు చేరింది. కొత్తగా అప్లికేషన్‌ లు వస్తూనే ఉన్నాయి. రేషన్ బియ్యం తింటూ రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అలాంటి బియ్యం క్వాలిటీ లేకుండా ఇస్తున్నారంటూ జనాలు అనడం లేదు కాని మీడియా గగ్గోలు పెడుతోంది. కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వ పథకాలు మరియు ఇతర విషయాల పట్ల ఎప్పుడు కూడా విమర్శలు చేస్తూనే ఉంది.తాజాగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం విషయంలో క్లీయర్ గా నోట్‌ ను విడుదల చేయడం చేజరిగింది. గతంతో పోల్చితే ఇప్పుడు అదనంగా క్వాలిటీ పెంచినట్లుగా వారు పేర్కొన్నారు.

fact check on ap public distribution system and rice quality

గతంలో రేషన్ బియ్యంలో నూకలు 25 శాతం ఉంటే ఇప్పుడు 15 శాతం వరకు ఉంటున్నాయి. ఇంతకు ముందు బియ్యం లో మట్టి, రాళ్లు, ఇసుక 0.5 శాతం ఉంటే ఇప్పుడు 0 శాతం కు తీసుకు రావడం జరిగింది. గతంలో ఇచ్చిన బియ్యం లో చెడిపోయిన గింజలు 3 శాతంగా ఉండేవి. వాటిని ఇప్పుడు 0.75 కి తగ్గించినట్లుగా అధికారులు తెలియజేశారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా బియ్యం ను పేదలకు ఇస్తున్నట్లుగా అధికారులు క్లారిటీ ఇచ్చారు. కొన్ని మీడియాలు చేస్తున్న అవాస్తవ ప్రచారం ఇప్పటికైనా నిలిపేయాలని వారు కోరుతున్నారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago