Fact Check : ఫ్యాక్ట్ చెక్ ఏపీలో ఇస్తున్న రేషన్ బియ్యం పుకార్ల పై క్లారిటీ
Fact Check : గత కొన్న రోజులుగా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ఇస్తున్న బియ్యం మరియు ఇతర సరుకుల విషయంలో కొన్ని మీడియా సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా బియ్యం క్వాలిటీ విషయమై పెద్ద ఎత్తున చర్చ నిర్వహిస్తూ ప్రజల్లో అభద్రతా భావం కల్పించడంతో పాటు పలు అనుమానాలు కలిగేలా చేస్తున్నారు. ఈ సమయంలో రేషన్ బియ్యం విషయంలో వస్తున్న విమర్శలపై ప్రజా పంపిణీ వ్యవస్థ ఉన్నతాధికారులు స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలకు ఫ్యాక్ట్ చెక్ ను సాక్ష్యాలతో సహా చూపించారు.2019 సంవత్సరం ముందు వరకు రాష్ట్రంల్ 1.39 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో ఆ సంఖ్య 1.45 కోట్లకు చేరింది. కొత్తగా అప్లికేషన్ లు వస్తూనే ఉన్నాయి. రేషన్ బియ్యం తింటూ రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అలాంటి బియ్యం క్వాలిటీ లేకుండా ఇస్తున్నారంటూ జనాలు అనడం లేదు కాని మీడియా గగ్గోలు పెడుతోంది. కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వ పథకాలు మరియు ఇతర విషయాల పట్ల ఎప్పుడు కూడా విమర్శలు చేస్తూనే ఉంది.తాజాగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం విషయంలో క్లీయర్ గా నోట్ ను విడుదల చేయడం చేజరిగింది. గతంతో పోల్చితే ఇప్పుడు అదనంగా క్వాలిటీ పెంచినట్లుగా వారు పేర్కొన్నారు.
గతంలో రేషన్ బియ్యంలో నూకలు 25 శాతం ఉంటే ఇప్పుడు 15 శాతం వరకు ఉంటున్నాయి. ఇంతకు ముందు బియ్యం లో మట్టి, రాళ్లు, ఇసుక 0.5 శాతం ఉంటే ఇప్పుడు 0 శాతం కు తీసుకు రావడం జరిగింది. గతంలో ఇచ్చిన బియ్యం లో చెడిపోయిన గింజలు 3 శాతంగా ఉండేవి. వాటిని ఇప్పుడు 0.75 కి తగ్గించినట్లుగా అధికారులు తెలియజేశారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా బియ్యం ను పేదలకు ఇస్తున్నట్లుగా అధికారులు క్లారిటీ ఇచ్చారు. కొన్ని మీడియాలు చేస్తున్న అవాస్తవ ప్రచారం ఇప్పటికైనా నిలిపేయాలని వారు కోరుతున్నారు.