Fact Check on APSRTC Jobs : అది ఫేక్ న్యూస్ క్లారిటీ ఇచ్చిన ఏపీఎస్ఆర్టీసీ..!!

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)కీ సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు ఇటీవల వార్త బయటకు రావడం తెలిసిందే. దాదాపు 5418 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ పై అధికారులు స్పందించారు. తమ సంస్థ నుండి ఎటువంటి నోటిఫికేషన్ విడుదల కాలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ తరఫున ఉద్యోగాల భర్తీకి విడుదలైనట్టు నోటిఫికేషన్ వార్త ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు. ఇటువంటి నకిలీ నోటిఫికేషన్ నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని హెచ్చరించారు.

అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు ఒక నెల క్రితం నుండి 2023 ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ నోటిఫికేషన్ అని సోషల్ మీడియా వాట్సప్ గ్రూపులలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతూ ఉంది. త్వరలో ఆర్టీసీలో భర్తీ కానున్న కండక్టర్ డ్రైవర్ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆ నోటిఫికేషన్ లో ఉంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మెసేజ్ లు… వాట్సప్ గ్రూపులలో… ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీఎస్ఆర్టీసీ సంస్థ అధికారులు అది ఫేక్ న్యూస్ అని ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రకటనలో…”గతంలో ఇదే తరహాలో ఫేక్ ప్రచారం జరిగింది. చాలామంది తప్పుడు మెయిల్స్ ద్వారా మోసపోయారు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నకిలీ ప్రకటనలు పంపి మోసం చేస్తున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళు ముందుగానే డబ్బులు పంపి బ్యాంకు మరియు ఆధార్ కార్డు వివరాలు కోరాలని హ్యాకర్లు కోరుతున్నారు.

Advertisement
Fact Check on APSRTC Jobs
Fact Check on APSRTC Jobs

దయచేసి ఎవరూ కూడా నమ్మొద్దు మోసపోవద్దు అని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రకటనలో స్పష్టం చేశారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ ఉంటే ఆర్టీసీ అధికారులే మీడియా ద్వారా గాని, పత్రికల ద్వారా గాని ఆ విషయాన్నీ అందరికీ తెలియజేసి అధికారికంగా ప్రకటిస్తారు. కాబట్టి ఇటువంటి ఫేక్ వార్తలను ఎవరూ నమ్మకండి. కనుక ఏపీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement