
Fake Baba rocket busted in uttar pradesh
Fake Baba : ఈమధ్య దొంగ బాబాలు ఎక్కువై పోయారు. మేము జ్యోతిష్యం చెబుతాం. భవిష్యత్తు చెబుతాం.. అది చెబుతాం.. ఇది చెబుతాం. మేము ఏది చెబితే అది జరుగుతుంది అంటూ నమ్మబలికే ఎందరో బాబాలను మనం ఇప్పటి వరకు చూసి ఉంటాం. పెద్ద పెద్ద బాబాలే ఫేక్ బాబాలు అని.. తమ దగ్గరికి వచ్చే మహిళలను లైంగికంగా వేధించారనే వార్తలను ఎన్నో చూశాం. తాజాగా అలాంటి ఓ దొంగ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఓ నకిలీ బాబా అని తెలియక అక్కడ చాలామంది అతడిని గుడ్డిగా నమ్మారు. ఆ తర్వాత అతడి నిజ స్వరూపం తెలిసిపోయింది.
తన దగ్గరికి వచ్చే భక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకున్న ఆ దొంగ బాబా రెచ్చిపోయేవాడు. కొందరు మహిళలు తమ సమస్య చెప్పుకునేందుకు తన దగ్గరికి వచ్చారు. అదే అదునుగా భావించిన ఆ దొంగ బాబా వాళ్లను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆ మహిళలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో దొంగ బాబా గుట్టు కాస్త రట్టయిపోయింది.
Fake Baba rocket busted in uttar pradesh
అతడి పేరు బాబా శ్యాం బిహారి. యూపీలోని గోరఖ్ పూర్ లో తన ఆశ్రమం ఉంది. కంపీర్ గంజ్ అనే గ్రామానికి చెందిన కొందరు మహిళలు వరుసగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబాలకు చెందిన మహిళలు ఈ బాబాను ఆశ్రయించారు. వాళ్ల మీద చేతబడి ప్రయోగం ఎవరైనా చేశారా అని ఆరా తీశారు. దీంతో మీరు రాత్రి పూట రండి.. నేను పరిష్కారం చెబుతా అనేవారు ఆ బాబా. అలా.. రాత్రిపూట వెళ్లిన ఆ మహిళలపై ఆ బాబా అత్యాచారం చేశాడు. అంతే కాదు.. వారి నుంచి డబ్బు కూడా గుంజాడు. తమ మీద బాబా అత్యాచారం చేశాడని తెలుసుకొని ఆ మహిళలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వెంటనే నకిలీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. తన దగ్గరికి వెళ్లిన మహిళలకు ముందు బాబా తీర్థం ఇస్తారు. ఆ తీర్థంలో మత్తుమందు కలిపి ఉంటుంది. ఆ తీర్థం తాగగానే మహిళలంతా మూర్చబోతారు. ఆ తర్వాత వాళ్ల మీద బాబా అత్యాచారం చేస్తాడు. వాళ్ల మత్తు వదిలాక.. దేవత అలా చేసింది అంటూ వాళ్లకు చెబుతాడు. చాలా ఏళ్ల నుంచి ఈ బాబా ఇలాగే మహిళలపై అత్యాచారం చేస్తున్నాడు. తాజాగా ఈ మహిళలు ఇచ్చిన ఫిర్యాదుతో దొంగ బాబా నాటకం కాస్త బయటపడింది. ఇప్పుడు జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.