
Father : తండ్రి అనేపదానికి మచ్చ తెచ్చిన నీచుడు.. ఛీ.. ఏడాదిగా కూతురిపై..!
Father : ఉత్తరప్రదేశ్‌లోని uttar pradesh మొరాదాబాద్ రైల్వే స్టేషన్‌లోని బాత్రూమ్ వద్ద ఓ చిన్న బ్యాగ్ కనిపించడం, అందులో పసికందు ఉండటం అక్కడ ఉన్న ప్రయాణికులను, పోలీసులను షాక్‌కు గురి చేసింది. రద్దీగా ఉండే ప్రదేశంలో బ్యాగ్ కనిపించడం చూసి మొదట బాంబు ఉందేమో అని భయపడ్డారు. కానీ అందులో అప్పుడే పుట్టిన శిశువు ఉండటం అందరినీ కలచివేసింది. ప్రయాణికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అదే బ్యాగ్‌లో లభించిన సిమ్‌కార్డ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు, ఈ ఘోరమైన ఘటన వెనకున్న నిజాన్ని బయటకు తీసుకొచ్చారు.
Father : తండ్రి అనేపదానికి మచ్చ తెచ్చిన నీచుడు.. ఛీ.. ఏడాదిగా కూతురిపై..!
బీహార్‌కు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఈ చిన్నారి తల్లి అని పోలీసులు వెల్లడించారు. ఆ బాలిక తన తండ్రి చేతిలో గత సంవత్సరం నుంచే లై-గిక వేధింపులకు గురవుతోందని, పలుమార్లు అతడి దురాగతాల వల్ల ఆమె గర్భం దాల్చిందని విచారణలో వెల్లడైంది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పరువు పోతుందనే భయంతో మౌనంగా ఉన్నారు. బాలికను ఢిల్లీలో వైద్యం కోసం తీసుకువెళ్తున్న సమయంలో రైలు ప్రయాణంలోనే ఆమె బాత్రూంలో పసిబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఎవరికీ తెలియకుండా ఆ చిన్నారిని మరో రైలు బాత్రూంలోని చెత్తబుట్టలో పడేసి పరారయ్యారు.
ప్రస్తుతం ఆ బాలికను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధీనంలోని రక్షిత కేంద్రానికి తరలించగా, శిశువును మొరాదాబాద్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. బాధిత కుటుంబం తమకు శిశువును పెంచుకునే పరిస్థితి లేదని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తండ్రే మృగంగా మారి తన కూతురి జీవితాన్ని బుగ్గిపాలు చేసిన ఈ దారుణం దేశంలో మహిళా భద్రతపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది.
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను…
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
This website uses cookies.