Festival | అక్టోబర్ 2025 పండుగలు.. దసరా నుంచి దీపావళి దాకా ఉత్సవాల హోరాహోరీ
Festival | భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో పండుగలు అతి ముఖ్యమైన భాగం. ప్రతి పండుగ ఓ గొప్ప ఆధ్యాత్మిక భావాన్ని, చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పండుగల సంఖ్య అధికంగా ఉంటుంది. 2025 అక్టోబర్ నెలలో ప్రత్యేకంగా జరుపుకునే పండుగలు, వేడుకలు ఎన్నో ఉన్నాయి.
ఈ ఏడాది అక్టోబర్‌లో దసరా, దీపావళి, నాగుల చవితి వంటి ప్రముఖ పండుగలతో పాటు కార్తీకమాసం ప్రారంభం కావడం హిందూ భక్తులకు ప్రత్యేక ఉత్సాహాన్నిచ్చే అంశం.
#image_title
అక్టోబర్ 2025 పండుగల లిస్ట్
దీపావళి – అక్టోబర్ 20, 2025
“దీపాల పండుగ”గా ప్రసిద్ధిగాంచిన దీపావళి దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహభరితంగా జరుపుకునే పండుగ. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీన్ని జరుపుతారు. లక్ష్మీ పూజ, టపాసులు, దీపాలతో అలంకారాలు దీన్ని మరింత అందంగా మార్చుతాయి.
నాగుల చవితి – అక్టోబర్ 23, 2025
దీపావళి తర్వాత నాలుగవ రోజు వచ్చే నాగుల చవితి పండుగను నాగదేవతల పూజకు అంకితమిస్తారు. పుట్టలో పాలు పోసి, చలిమిడి వంటి నైవేద్యాలు సమర్పించడమే కాకుండా, సర్పదోష నివారణకూ ఈ పండుగను ముఖ్యంగా భావిస్తారు.
కార్తీకమాసం ప్రారంభం – అక్టోబర్ 22, 2025
హిందూ పంచాంగ ప్రకారం, దీపావళి అమావాస్య తర్వాత మొదలయ్యే కార్తీకమాసం అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. శివునికి ఇష్టమైన మాసంగా ఈ నెలలో భక్తులు కార్తీక స్నానాలు చేసి, దీపదానాలు చేస్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తారు. ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు, వ్రతాలు జరుగుతుంటాయి.
ఈ సమాచారం ప్రాచీన మత విశ్వాసాలు, పంచాంగ శాస్త్రాల ఆధారంగా ఇవ్వబడింది. కొన్ని తేదీలు స్థానిక కాలమానం ప్రకారం మారవచ్చు. మీ ప్రాంతంలో ఉండే అధికారిక పంచాంగం ప్రకారం ఖచ్చితమైన తేదీలను ధృవీకరించాలి.