Fiber Gas Cylinder : మార్కెట్ లోకి ఫైబర్ గ్యాస్ సిలిండర్లు.. తొందర్లోనే అందరికీ అందుబాటులోకి..
Fiber Gas Cylinder : ప్రస్తుతం సిలిండర్ బరువు కంటే దాని ధరే సామాన్యులకు భారంగా మారింది. రోజురోజుకు పెరుతున్న చమురు ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే సిలిండర్ ధర తగ్గకపోవచ్చు కానీ సిలిండర్ బరువు తగ్గనుంది. ఎంతో మంది సిలిండర్లు మోయలేక ఇబ్బందులు పడుతుంటారు. ఇక ఆపార్ట్ మెట్స్ లో ఉండేవారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఖాళీ సిలిండర్ మోయడానికే ఇబ్బంది పడే సిబ్బంది ఫుల్ సిలిండర్ తో తిప్పలు పడేవారు. అయితే ఈ కష్టాలు తొందర్లోనే తీరనున్నాయి.
మార్కెట్ లోకి ఫైబర్ సిలిండర్లు వచ్చేశాయ్.. ఐరన్ సిలిండర్ తో పోలిస్తే అతితక్కువ బరువు ఉండేలా డిజైన్ చేశారు. అలాగే సిలిండర్ లో గ్యాస్ ఎంతవరకు ఉందనేది కూడా కనిపించనుంది. అలాగే ఐరన్ సిలిండర్లు తుప్పు పడుతుంటాయి.. ఇంట్లో మరకలు ఏర్పడుతుంటాయి. ఫైబర్ సిలిండర్లతో ఈ ఇబ్బందులు తప్పనున్నాయి. అయితే ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తేలికైన ఫైబర్ సిలిండర్ లను హైదరాబాద్ లో తీసుకువచ్చారు. త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నారు.
Fiber Gas Cylinder : పది కిలోలు, ఐదు కిలోలు మాత్రమే అందుబాటులో..
అయితే ఇందులో 10 కిలోలు, 5 కిలోలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఐరన్ ఖాళీ సిలిండర్ బరువు 16 కిలోలు ఉండగా.. ఫైబర్ సిలిండర్ 6.3 కిలోలు ఉంటుంది. ఇక 10 కిలోల ఫైబర్ సిలిండర్‌కు రూ.3, 350 ఉండగా 5 కిలోల సిలిండర్‌కు రూ.2,150 అడ్వాన్స్ చెల్లించాలి. వినియోగదారులు ఇప్పటికే వాడుతున్న పాత సిలిండర్లను తిరిగి ఇచ్చి ఫైబర్ సిలిండర్లను సంబంధిత గ్యాస్ ఏజన్సీలో తీసుకోవచ్చని చెబుతున్నారు. రూ.670 చెల్లించి 10 కిలోల సిలిండర్, రూ.330 చెల్లించి ఐదు కిలోల సిలిండర్‌లో గ్యాస్ నింపుకోవచ్చని అంటున్నారు.