Pradhan Mantri Mudra Yojana : ప్రధాన మంత్రి ముద్ర యోజన.. లోన్ పరిమితిని కేంద్రం పెంచడం జరిగింది. ఇటీవల వార్షిక బడ్జెట్‌లోనే ముద్ర స్కీమ్ కింద రుణ పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం మనకు తెలిసిందే. ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం తెలిపింది. ముద్ర పథకం కింద లోన్ పొందే మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. రుణాల అందజేత ప్రక్రియ తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసం రుణాలు అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.
ఈ రుణాల్లో మొత్తం 3 రకాల రుణాలు ఉంటాయి. శిశు రుణాల కింద రూ. 50 వేల వరకు లోన్ పొందవచ్చు. కిశోర రుణాల కింద రూ. 50 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు.. తరుణ్ రుణాల కింద రూ. 5-10 లక్షల వరకు రుణం పొందవచ్చు. శిశు రుణాల కింద రూ. 50 వేల వరకు లోన్ వస్తుంది. కిశోర రుణాల కింద రూ. 50 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు.. తరుణ్ రుణాల కింద రూ. 5-10 లక్షల వరకు లోన్ వస్తుంది. ఇప్పుడు మరో కొత్త కేటగిరీని జోడించారు. తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీ తీసుకొచ్చి.. దీని కిందనే రూ. 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఎవరైతే.. ఇలాంటి లోన్లు అంటే తరుణ్ లోన్లు పొంది వాటిని తిరిగి చెల్లిస్తారో.. వారికి మాత్రమే ఈ లోన్లు అందుతాయని పేర్కొంది.
2015లో మోదీ సర్కార్ పీఎంఎంవై స్కీమ్ లాంఛ్ చేసింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిధులు సమకూర్చాలన్న ఉద్దేశంతోనే కేంద్రం ఈ పథకం తెచ్చింది. కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు అందించడం కోసం పీఎంఏవై పథకాన్ని.. 2015 ఏప్రిల్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రుణాలను పీఎంఏవై కింద ముద్ర రుణాలుగా వర్గీకరించారు. వీటిని మెంబర్ లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్‌లు అందిస్తాయి. అంటే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో-ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్‌లు రుణాలు ఇస్తుంటాయి. ముద్ర లోన్ వడ్డీ రేట్లు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో 9.15 – 12.80 శాతం వరకు, ప్రైవేట్ బ్యాంకుల్లో 6.96 నుంచి 28 శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయి. రుణ గ్రహీత రిస్క్ ప్రొఫైల్, రుణ కాలవ్యవధి, ఎంత లోన్ తీసుకున్నారనే దానిని బట్టి వడ్డీ రేట్లు మారతాయి.
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
This website uses cookies.