Pradhan Mantri Mudra Yojana : గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్ర‌భుత్వం.. ముద్ర లోన్ పరిమితి రెట్టింపు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pradhan Mantri Mudra Yojana : గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్ర‌భుత్వం.. ముద్ర లోన్ పరిమితి రెట్టింపు..!

Pradhan Mantri Mudra Yojana : ప్రధాన మంత్రి ముద్ర యోజన.. లోన్ పరిమితిని కేంద్రం పెంచ‌డం జ‌రిగింది. ఇటీవల వార్షిక బడ్జెట్‌లోనే ముద్ర స్కీమ్ కింద రుణ పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించ‌డం మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం తెలిపింది. ముద్ర పథకం కింద లోన్ పొందే మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. రుణాల అందజేత ప్రక్రియ […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 October 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Pradhan Mantri Mudra Yojana : గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్ర‌భుత్వం.. ముద్ర లోన్ పరిమితి రెట్టింపు..!

Pradhan Mantri Mudra Yojana : ప్రధాన మంత్రి ముద్ర యోజన.. లోన్ పరిమితిని కేంద్రం పెంచ‌డం జ‌రిగింది. ఇటీవల వార్షిక బడ్జెట్‌లోనే ముద్ర స్కీమ్ కింద రుణ పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించ‌డం మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం తెలిపింది. ముద్ర పథకం కింద లోన్ పొందే మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. రుణాల అందజేత ప్రక్రియ తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసం రుణాలు అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.

Pradhan Mantri Mudra Yojana డ‌బుల్ బొనాంజా..

ఈ రుణాల్లో మొత్తం 3 రకాల రుణాలు ఉంటాయి. శిశు రుణాల కింద రూ. 50 వేల వరకు లోన్ పొందవచ్చు. కిశోర రుణాల కింద రూ. 50 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు.. తరుణ్ రుణాల కింద రూ. 5-10 లక్షల వరకు రుణం పొందవచ్చు. శిశు రుణాల కింద రూ. 50 వేల వరకు లోన్ వస్తుంది. కిశోర రుణాల కింద రూ. 50 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు.. తరుణ్ రుణాల కింద రూ. 5-10 లక్షల వరకు లోన్ వస్తుంది. ఇప్పుడు మరో కొత్త కేటగిరీని జోడించారు. తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీ తీసుకొచ్చి.. దీని కిందనే రూ. 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఎవరైతే.. ఇలాంటి లోన్లు అంటే తరుణ్ లోన్లు పొంది వాటిని తిరిగి చెల్లిస్తారో..  వారికి మాత్రమే ఈ లోన్లు అందుతాయని పేర్కొంది.

Pradhan Mantri Mudra Yojana గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్ర‌భుత్వం ముద్ర లోన్ పరిమితి రెట్టింపు

Pradhan Mantri Mudra Yojana : గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్ర‌భుత్వం.. ముద్ర లోన్ పరిమితి రెట్టింపు..!

2015లో మోదీ సర్కార్ పీఎంఎంవై స్కీమ్ లాంఛ్ చేసింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిధులు సమకూర్చాలన్న ఉద్దేశంతోనే కేంద్రం ఈ పథకం తెచ్చింది. కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు అందించడం కోసం పీఎంఏవై పథకాన్ని.. 2015 ఏప్రిల్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రుణాలను పీఎంఏవై కింద ముద్ర రుణాలుగా వర్గీకరించారు. వీటిని మెంబర్ లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్‌లు అందిస్తాయి. అంటే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో-ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్‌లు రుణాలు ఇస్తుంటాయి. ముద్ర లోన్ వడ్డీ రేట్లు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో 9.15 – 12.80 శాతం వరకు, ప్రైవేట్ బ్యాంకుల్లో 6.96 నుంచి 28 శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయి. రుణ గ్రహీత రిస్క్ ప్రొఫైల్, రుణ కాలవ్యవధి, ఎంత లోన్ తీసుకున్నారనే దానిని బట్టి వడ్డీ రేట్లు మారతాయి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది