Home » Andhra Pradesh » Flexi Issue During Chandrababu Visit In Godavari Districts
andhra pradesh

Chandrababu : చంద్రబాబు పర్యటనలో ఫ్లెక్సీల రగడ.. “14 ఏళ్ల నీ దుర్మార్గ పాలనే ప్రజల కర్మ”..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: December 2, 2022 12:25 pm
Advertisement

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాలో “ఇదేం కర్మ రా బాబు” అనే కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో చంద్రబాబు మండిపడుతున్నారు. ఆందోళనలు నిరసనలు ఇంకా రోడ్ షోలు… పలు బహిరంగ సభలు నిర్వహిస్తూ సీఎం జగన్ పై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.పరిస్థితి ఇలా ఉంటే సరిగ్గా చంద్రబాబు తాడేపల్లిగూడెం నియోజకవర్గం

Advertisement

చేరుకునే క్రమంలో ఆయన కార్యక్రమానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాగతం పలుకుతూ పెట్టిన ఫ్లెక్సీల పక్కనే…చంద్రబాబు వల్ల పట్టిన ఖర్మ నేడు జగన్ పాలనలో ప్రక్షాల జరుగుతుంది అంటూ ‘వద్దు బాబోయ్ వద్దు’ అని నిరసన జ్వాలలు తాడేపల్లిగూడెం లో వెల్లువిరిసాయి. ఒక్కో ఫ్లెక్సీలో ఒక్కో స్లోగాన్ ఉంది. నువ్వొస్తే బడులు ప్రైవేటీకరణ చేస్తావ్. 14 ఏళ్ల నీ దుర్మార్గ పాలనే ప్రజల కర్మ. వద్దు బాబోయ్ వద్దు. నువ్వు వస్తే పోలవరం ప్రగతి పడకే. నువ్వొస్తే కుట్రలు కుతంత్రాలు.

flexi issue during chandrababu visit in godavari districts

Advertisement

నీదంతా గ్రాఫిక్స్ పాలన. నువ్వు వస్తే అమరావతి గురించి ఆలోచిస్తావు. వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తావ్.. అంటూ వివిధ రకాలుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు కవ్వింప చర్యలకు పాల్పడుతున్నారని జిల్లా టిడిపి నేతలు మండిపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం యాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి