Chandrababu : రాజధాని రైతులకి CM చంద్రబాబు బంపర్ గుడ్ న్యూస్..!
Chandrababu నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజధానిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసమీరణ (ల్యాండ్ పూలింగ్) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఆర్డీఏ (APCRDA)
Chandrababu : నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజధానిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసమీరణ (ల్యాండ్ పూలింగ్) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఆర్డీఏ (APCRDA) అథారిటీ కీలక సమావేశంలో నిర్ణయించింది. ఈ మేరకు రాజధాని కోసం గతంలో భూములు త్యాగం చేసిన రైతులతో పాటు, ఇప్పుడు రెండో దశలో భూములు ఇస్తున్న రైతన్నల కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించి వారికి తీపికబురు అందించింది. అంతేకాకుండా, శాకమూరులో ఒక భారీ సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీతో పాటు కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించేందుకు ఏకంగా రూ.596 కోట్లను కేటాయిస్తూ అథారిటీ ఆమోదముద్ర వేసింది.
Chandrababu : రాజధాని రైతులకి CM చంద్రబాబు బంపర్ గుడ్ న్యూస్..!
Chandrababu అమరావతి గ్రామాల్లో మౌలిక వసతుల జాతర.. మారుతున్న రూపురేఖలు
రాజధాని పరిధిలోని 29 గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.1,437 కోట్లతో ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో ఇప్పటికే రూ.904 కోట్లకు ఆమోదం తెలపగా, తాజాగా మరో రూ.533 కోట్లను మంజూరు చేశారు. రాజధాని నగరంలో ఉండే స్థాయిలోనే.. ఈ 29 గ్రామాల్లోనూ అత్యాధునిక రోడ్లు, డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, సురక్షిత తాగునీటి లైన్లు, మరియు ఆధునిక వీధి దీపాలు (లైటింగ్) వంటి సకల సదుపాయాలను కల్పించనున్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS) లేఅవుట్లలోని చిన్న రోడ్లను మొదట సీసీ రోడ్లుగా వేయాలని భావించినప్పటికీ, నిపుణుల అధ్యయనం అనంతరం వాటి స్థానంలో నాణ్యమైన బీటీ రోడ్లను నిర్మించాలని అథారిటీ నిర్ణయించింది.
భూముల కేటాయింపులో నయా పాలసీ.. రైతులకు రుణమాఫీ ఆఫర్!
రాజధానిలో హోటళ్లు, పాఠశాలలు, ఇతర ప్రాజెక్టుల కోసం గతంలో భూములు కేటాయించిన సంస్థలు.. తమ పక్కనే ఉన్న అదనపు భూమిని కోరితే కేటాయించేందుకు సీఆర్డీఏ ఒక సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. త్రీ స్టార్, ఫోర్ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లు లేదా జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్కూల్స్ అదనపు భూమిని అడిగితే.. అమరావతిలో ప్రస్తుతం ఉన్న కనీస భూమి ధరపై కనీసం 250 శాతం ప్రీమియం ధరకు కేటాయించేందుకు అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే, అమరావతిలో ప్రస్తుత కనీస ధర ఎకరాకు రూ.4.1 కోట్లుగా ఉండగా, ఈ అదనపు భూమిని కనీసం ఎకరాకు రూ.10.25 కోట్లకు తగ్గకుండా ఆ సంస్థలకు కేటాయిస్తారు.
ఇక మరోవైపు, ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల్లోని రైతులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాజధాని కోసం భూములు ఇస్తున్న ఒక్కో రైతు కుటుంబానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు రుణమాఫీ చేయాలని అథారిటీ నిర్ణయించింది. అయితే, 2026 జనవరి 1వ తేదీకి ముందు తీసుకున్న వ్యవసాయ లేదా సంబంధిత రుణాలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. మొత్తానికి ఈ నిర్ణయాలతో అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.







