Karthika Deepam 2 Today Episode August 28th : కార్తీక దీపం 2 ఆగస్ట్ 28: ఆగిపోయిన జ్యోత్స్న పెళ్లి.. సూరజ్‌పై మాలిని సంచలన నిజం..!
Karthika Deepam 2 Today Episode August 28th కార్తీక దీపం 2 ఆగస్ట్ 28 ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. జ్యోత్స్న మెడలో సూరజ్ తాళి కట్టబోతున్న సమయంలో మాలిని ఒక్కసారిగా అసలు నిజాన్ని బయటపెట్టింది. ‘‘సూరజ్ నా కొడుకు’’
Karthika Deepam 2 Today Episode August 28th : కార్తీక దీపం 2 ఆగస్ట్ 28 ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. జ్యోత్స్న మెడలో సూరజ్ తాళి కట్టబోతున్న సమయంలో మాలిని ఒక్కసారిగా అసలు నిజాన్ని బయటపెట్టింది. ‘‘సూరజ్ నా కొడుకు’’ అంటూ బాంబు పేల్చడంతో పెళ్లి మండపం ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిపోయింది. ఇంతకీ సూరజ్ ఎవరు? మాలిని ఎందుకు ఇంతకాలం ఈ నిజాన్ని దాచింది? జ్యోత్స్న-సూరజ్ పెళ్లిని ఎందుకు ఆపింది? అసలు ఈ పగకు కారణం ఏంటి? అనే ప్రశ్నలకు తాజా ఎపిసోడ్‌లో సమాధానం దొరికింది. గత ఎపిసోడ్‌లోనే జ్యోత్స్న తన మెడలో తాళి పడిన వెంటనే దీపే ఈ ఇంటికి అసలైన వారసురాలు అని అందరికీ చెప్పేస్తానని దాస్‌తో చెబుతుంది. తనకు నచ్చినట్టుగా చేసుకోమని దాస్ చెప్పడంతో పారు ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే దాస్ ఏది చెప్పినా పర్వాలేదు కానీ, పిల్లలను మార్చింది తానే అన్న నిజాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టకూడదని పారు అతని దగ్గర ఒట్టు వేయించుకుంటుంది. ఇదిలా ఉంటే జ్యోత్స్నను తీసుకెళ్లడానికి దీప వస్తుంది. అప్పుడు దాస్ బాబాయ్‌తో ఏం మాట్లాడావని జ్యోత్స్నను అడుగుతుంది. ఈరోజు నువ్వు ఎవరో అందరికీ చెప్పేస్తానని జ్యోత్స్న చెబుతుంది. అయితే అలా చేయొద్దని దీప కోరుతుంది. ‘‘నీ రుణం తీర్చుకుంటాను. ఇక నుంచి మనిద్దరం అక్కాచెల్లెళ్లలా కలిసి ఉందాం’’ అని జ్యోత్స్న చెప్పడంతో దీప భావోద్వేగానికి గురవుతుంది. ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతాయి.
Karthika Deepam 2 Today Episode August 28th : కార్తీక దీపం 2 ఆగస్ట్ 28: ఆగిపోయిన జ్యోత్స్న పెళ్లి.. సూరజ్‌పై మాలిని సంచలన నిజం..!
Karthika Deepam 2 Today Episode August 28th దీపకు తల్లిదండ్రులు ఉన్నారంటూ జ్యోత్స్న చేసిన ప్రకటన
జ్యోత్స్న మెడలో సూరజ్ తాళి కట్టిన తర్వాత ఇంట్లో అందరూ ఆనందంలో మునిగిపోతారు. ఏడడుగులు వేయించేందుకు ఏర్పాట్లు కూడా మొదలవుతాయి. కానీ అదే సమయంలో జ్యోత్స్న ఒక్కసారిగా పెళ్లి వేదిక నుంచి కిందకు దిగుతుంది. ‘‘మీ అందరికీ ఒక నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది’’ అంటూ అందరినీ ఉత్కంఠకు గురిచేస్తుంది. ఇంతకాలం దీపను అందరూ అనాథ అని పిలిచారని గుర్తుచేస్తూ, దీపకు కూడా తల్లిదండ్రులు ఉన్నారని చెబుతుంది. వెంటనే సుమిత్ర, దశరథలను పిలిచి వారి చేతుల్లో దీప చేతిని పెడుతుంది. దీపను కన్న తల్లిదండ్రులు సుమిత్ర, దశరథలే అని జ్యోత్స్న ప్రకటించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. దశరథ కూడా ఆ నిజాన్ని అంగీకరించడంతో సుమిత్ర భావోద్వేగానికి గురై దీపను దగ్గరకు తీసుకుని హత్తుకుంటుంది.
ఈ సన్నివేశం గత ఎపిసోడ్‌లోనే ప్రధాన హైలైట్‌గా నిలిచింది. మరి ఆగస్ట్ 28న ప్రసారమైన 763వ ఎపిసోడ్‌లో అసలు ఏం జరిగింది? అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపు తిరిగింది? జ్యోత్స్న కేవలం దీప తల్లిదండ్రుల నిజాన్ని బయటపెట్టడమే కాదు.. కార్తీక్‌తో రాయించుకున్న అగ్రిమెంట్‌ను కూడా అందరి ముందే చించి ముక్కలు చేస్తుంది. ‘‘ఈరోజు నుంచి బావతో ఉన్న అగ్రిమెంట్ కూడా రద్దయిపోయింది. ఇకపై సుమిత్రగారిని నువ్వు అమ్మ అని పిలవొచ్చు’’ అని దీపతో చెబుతుంది. దీంతో సుమిత్ర, దీప ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. అయితే ఇంతలో దీప ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర నుంచి లేస్తుంది. అదంతా తన కల అని అర్థమవుతుంది. వెంటనే కార్తీక్‌ను చూసి తాను కన్న కల గురించి చెబుతుంది. ‘‘నువ్వే శివన్నారాయణ గారి మనవరాలివి అని కల కన్నావా?’’ అని కార్తీక్ అడుగుతాడు. అందుకు దీప, ‘‘జ్యోత్స్న నిజం చెప్పేస్తాను అంది. ఊహ ఇంత అందంగా ఉంటే.. నిజం ఇంకెంత అందంగా ఉంటుందో’’ అని తన మనసులోని కోరికను బయటపెడుతుంది. అయితే పెళ్లి వేడుకలో ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తగా ఉండాలని కార్తీక్ దీపకు చెబుతాడు. ‘‘నువ్వు వెళ్లి మీ మాలిని అత్త దగ్గరే కూర్చో. జ్యోత్స్న మెడలో మూడు ముళ్లు పడే వరకు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ పెళ్లి మన బాధ్యత’’ అని అంటాడు. దీంతో దీప కూడా మాలిని దగ్గరకు వెళ్లి కూర్చుంటుంది.
Karthika Deepam 2 Today Episode August 28th కార్తీక్-మాలిని మధ్య మాటల యుద్ధం.. సూరజ్ గురించి కీలక చర్చ
ఈ పెళ్లికి మీ జీవితానికి ఏదో ఒక సంబంధం ఉందని, పెళ్లి పూర్తయిన తర్వాత మీ జీవితాల్లో భారీ మార్పులు రాబోతున్నట్లు తనకు అనిపిస్తోందని శ్రీధర్ కార్తీక్‌తో అంటాడు. ‘‘ఎవరి జీవితం ఎప్పుడు మారుతుందో చెప్పగలవా?’’ అని కార్తీక్‌ను అడుగుతాడు. అయితే కార్తీక్ మాత్రం కాస్త ఓపిక పట్టాలని చెబుతాడు. సమయం వచ్చినప్పుడు ఆడియన్స్ అంతా అవాక్కయ్యేలా షాక్ ఇస్తామని చెబుతూ మాలిని పక్కనే వెళ్లి కూర్చుంటాడు. కార్తీక్ ఒకవైపు, దీప మరోవైపు కూర్చోవడంతో మాలిని కూడా మాట మొదలుపెడుతుంది. ‘‘అటువైపు దీప, ఇటువైపు నువ్వు.. మీ తాత నా మీద భయంతో మీ ఇద్దరినీ కాపలాగా పెట్టాడా?’’ అని కార్తీక్‌ను ప్రశ్నిస్తుంది. వెంటనే దీప స్పందిస్తూ, ‘‘భయపడటానికి నువ్వేమైనా రాక్షసివా? పైగా నీ మేనకోడలి పెళ్లి కదా’’ అని అంటుంది. కాసేపట్లో పెళ్లి పూర్తవుతుందని, ఆ తర్వాత అందరూ కలిసి బంతి భోజనం చేద్దామని కార్తీక్ అంటాడు. పెళ్లి వీడియో ఎడిటింగ్ పూర్తయిన వెంటనే ఫస్ట్ కాపీని దక్షిణామూర్తి తాతకు పంపిద్దామని చెబుతాడు. అలాగే ‘‘మా జ్యోత్స్న ఇంతలా సిగ్గుపడటం నేను మొదటిసారి చూస్తున్నాను’’ అని అంటాడు.
తను పెంచిన సూరజ్ పెళ్లిని చూసి ఆ పెద్దాయన చాలా సంతోషపడుతున్నాడని కార్తీక్ చెబుతాడు. కానీ మాలిని మాత్రం వెంటనే అనుమానం వ్యక్తం చేస్తుంది. ‘‘అతను సూరజ్‌ను పెంచడం నువ్వు చూశావా? నమ్మితే మోసపోతావు’’ అని కార్తీక్‌ను హెచ్చరిస్తుంది. అయినా కార్తీక్ వెనక్కి తగ్గడు. ‘‘సూరజ్ లాంటి మంచి వ్యక్తి ఉంటాడు. ఆ పెద్ద మనిషి లాంటి మహానుభావుడు కూడా ఉంటాడు’’ అని చెబుతాడు. అంతేకాదు, సూరజ్ అనాథ కాదని, ఇకపై తమ అమ్మానాన్నలే సూరజ్‌కు కూడా అమ్మానాన్నలని చెబుతాడు. ‘‘సూరజ్ నాకు తమ్ముడు. నీకు నచ్చలేదా?’’ అని కార్తీక్ మాలినిని ప్రశ్నిస్తాడు. దానికి మాలిని వ్యంగ్యంగా, ‘‘నేను పిన్ని, సూరజ్ తమ్ముడు.. వరుస అయితే బాగానే సరిపోయింది’’ అని అంటుంది.దాంతో కార్తీక్‌కు కోపం వస్తుంది. ‘‘నీలాంటి దానితో సూరజ్‌ను పోల్చుకోవద్దు. అలాంటి నిజాయితీ నువ్వు సంపాదించుకోవాలంటే ఇంకో జన్మ ఎత్తాలి’’ అంటూ మాలినిపై ఘాటుగా స్పందిస్తాడు.మరోవైపు మాలిని కూడా మాటలతోనే సమాధానం ఇస్తుంది. ‘‘మంచి వాడినే దశరథ అన్నయ్య అల్లుడిగా చేసుకుంటున్నాడు’’ అని చెబుతుంది. ఆ తర్వాత సూరజ్-జ్యోత్స్న పెళ్లి జరుగుతుందా అని కార్తీక్‌ను అడుగుతుంది.
అందుకు కార్తీక్ ‘‘ఎవరు ఆపినా ఈ పెళ్లి ఆగదు. తథాస్తు దేవతలు దిగొచ్చినా ఈ పెళ్లి ఆగదు’’ అని ధీమాగా చెబుతాడు. దీంతో మాలిని మాటలపై అతను మరింత సీరియస్ అవుతాడు. ‘‘నీ ఆడబిడ్డ కూతురు, స్వయానా నీ మేనకోడలు పెళ్లి జరుగుతున్న సమయంలో ఇంత అపశకునంగా ఎవరైనా మాట్లాడతారా?’’ అని మాలినిని నిలదీస్తాడు.
తాళి కట్టబోతూ ఆగిపోయిన సూరజ్
అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూరజ్ జ్యోత్స్న మెడలో తాళి కట్టబోయే సమయంలో ఒక్కసారిగా ఆగిపోతాడు. తాళి కట్టాలని జ్యోత్స్నతో పాటు శివన్నారాయణ కూడా సూరజ్‌ను బతిమలాడుతారు. కానీ సూరజ్ మాత్రం తాళిని జ్యోత్స్న ఒడిలోనే వదిలేస్తాడు. ఈ ఒక్క సంఘటనతో పెళ్లి మండపంలో ఉన్న వారందరూ షాక్‌కు గురవుతారు. అసలు సూరజ్ ఎందుకు తాళి కట్టకుండా ఆపేశాడో ఎవరికీ అర్థం కాదు. అప్పుడే మాలిని అసలు బాంబు పేలుస్తుంది. ‘‘సూరజ్ నా కొడుకు అయినా ఈ పెళ్లి ఆగదా?’’ అని ఆమె చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఆ తర్వాత మాలిని నేరుగా పెళ్లి పీటల మీదకు వెళ్లి సూరజ్ తన కొడుకు అని ప్రకటిస్తుంది. దీంతో శివన్నారాయణ కుటుంబం మొత్తం షాక్ అవుతుంది. ‘‘సూరజ్ అనాథ కాదు. ఈ మాలిని, కృష్ణమూర్తుల ఒక్కగానొక్క కొడుకు’’ అని మాలిని స్పష్టంగా చెబుతుంది. సూరజ్ నీ కొడుకైతే మరి ఇంతకాలం అతనితో ఉన్న ఆ పెద్దాయన ఎవరు? అని కార్తీక్ చుట్టూ వెతుకుతాడు. కానీ అప్పటికే ఆ పెద్దాయన అక్కడ కనిపించడు.
మాలిని పగ వెనుక అసలు కథ ఇదేనా?
ఇక అసలు ట్విస్ట్‌ను మాలిని బయటపెడుతుంది. ‘‘ఆ పెద్దాయన నా మనిషే. ఇంతకాలం జరిగినదంతా నేను ఆడించిన నాటకమే. ఈ మాలిని పగకు నిలువెత్తు రూపం నా కొడుకు సూరజ్’’ అని చెబుతుంది. అంతేకాదు, కార్తీక్ వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి తమ ఇంటికి వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తుచేస్తుంది. ‘‘నువ్వు మా ఇంటికి వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మా ఇంట్లో చూసింది సూరజ్‌నే. నిజాన్ని నీ కళ్లతో చూశావు. కానీ నీ మనసుతో మాత్రం నమ్మలేకపోయావు’’ అని మాలిని అంటుంది. ఆ తర్వాత అసలు విషయాన్ని పక్కన ఉన్న వారితో చర్చించాల్సిన అవసరం లేదన్నట్టుగా, ‘‘మిగతా విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు వీళ్లంతా ఇక్కడ ఎందుకు?’’ అని ప్రశ్నిస్తుంది. దుర్ముహూర్తం దాటిపోయినా ఈ పెళ్లి జరగదని మాలిని తేల్చి చెబుతుంది. దీంతో శివన్నారాయణ కుటుంబానికి మరోసారి పెద్ద షాక్ తగులుతుంది. శివన్నారాయణ గారి మనవరాలి పెళ్లి ఇలా మూడోసారి ఆగిపోయిందని మాలిని అందరికీ గుర్తుచేస్తుంది.
ఇంతటితో ఆగకుండా అక్కడికి వచ్చిన బంధుమిత్రులను ఉద్దేశించి కూడా మాలిని సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ‘‘మీరంతా ఇక్కడి నుంచి బయల్దేరొచ్చు. ఇక్కడ జరిగిన విషయం అందరికీ చెప్పండి. ఎందుకంటే ఇక్కడ జరిగిన విషయం అందరికీ తెలియాలి. అందరూ ఏడాది పాటు గుర్తుపెట్టుకునేలా ఉండాలి’’ అని చెబుతుంది. మాలిని మాటలతో పెళ్లి మండపంలోని వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటివరకు సంతోషంగా ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అయోమయంలో పడిపోతారు. మాలిని అక్కడితో ఆగకుండా శివన్నారాయణను నేరుగా ప్రశ్నిస్తుంది. ‘‘ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుందా? సూరజ్ నా కొడుకు అని తెలిసినా ఈ పెళ్లి చేస్తావా? మీ మనవరాలికి నా కొడుకుతో పెళ్లి జరిపిస్తారా? నీ మేనకోడలు జ్యోత్స్నకు నా కొడుకుతో పెళ్లి చేస్తావా?’’ అంటూ వరుస ప్రశ్నలతో నిలదీస్తుంది.
ఈ మాటలతో కార్తీక్ కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. ‘‘ఎంత నమ్మకద్రోహం చేశావు పిన్ని’’ అంటూ మాలినిపై మండిపడతాడు. అయితే మాలిని మాత్రం కార్తీక్ ఆరోపణలను తిప్పికొడుతుంది. ‘‘ఎవరు నమ్మకద్రోహం చేశారు? నాకు, నా కొడుకుకి జరిగిన అన్యాయం ముందు ఇప్పుడు పెళ్లి ఆగిపోవడం చాలా చిన్న విషయం’’ అని చెబుతుంది. ‘‘ఇక్కడ పెళ్లి ఆగిపోవడాన్ని నమ్మకద్రోహం అంటున్నావు. మరి నా భర్తను చంపిన మిమ్మల్ని ఏమనాలి? ద్రోహులా? హంతకులా? మిమ్మల్ని ఎలా పిలవాలి?’’ అంటూ మాలిని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. దానికి కార్తీక్ వెంటనే స్పందిస్తూ, ‘‘నీ భర్తను మేము చంపామా?’’ అని ప్రశ్నిస్తాడు. అయితే మాలిని మాత్రం ‘‘అవును’’ అని స్పష్టంగా సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత ఇన్నాళ్లుగా తన మనసులో మండుతున్న పగకు అసలు కారణాన్ని మాలిని బయటపెడుతుంది. తన భర్త చనిపోయినప్పటి నుంచి మాత్రమే తనలో పగ మొదలుకాలేదని, అసలు ఆ పగకు బీజం సుమిత్ర-కార్తీక్ కుటుంబంలో జరిగిన పెళ్లితోనే పడిందని చెబుతుంది.‘‘పగ పురుడు పోసుకున్నది నా భర్త చావుతో కాదు. మీ అత్త, మీ మేనమామల పెళ్లితోనే. సరిగ్గా ఇప్పుడు జ్యోత్స్న పెళ్లికూతురిగా ముస్తాబైనట్టే.. అప్పట్లో సుమిత్ర కూడా పెళ్లికూతురిగా ముస్తాబైంది. ఆ సమయంలోనే ఈ గొడవ మొదలైంది’’ అని మాలిని చెబుతుంది.
దీంతో ఇప్పటివరకు జరిగిన సంఘటనల వెనుక మాలిని పగకు ఉన్న కారణం ఏమిటన్నది మరింత ఆసక్తికరంగా మారుతుంది. సూరజ్‌ను ఇంతకాలం ఎందుకు దాచింది? ఆ పెద్దాయన ఎవరు? మాలిని పగకు సుమిత్ర పెళ్లికి ఉన్న సంబంధం ఏంటి? ఇక దీప జీవితంలో నిజం ఎప్పుడు బయటపడుతుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. ఇలా సూరజ్ తన కొడుకేనంటూ మాలిని చేసిన సంచలన ప్రకటనతో జ్యోత్స్న-సూరజ్ పెళ్లి మళ్లీ ఆగిపోవడంతో ఆగస్ట్ 28 ఎపిసోడ్ ముగిసింది. ఇక రాబోయే ఎపిసోడ్లలో మాలిని చెప్పిన గత కథలోని అసలు నిజం ఎలా బయటపడుతుందో చూడాలి.







