Wedding Loan : పెళ్లి గ్రాండ్ గా చేయాలనుకుంటున్నారా.. అయితే వెడ్డింగ్ లోన్ ఉందిగా..
Wedding Loan: ప్రస్తుత రోజుల్లో పెళ్లి చాలా ఖరీదైన ఈవెంట్. హిందూ సాంప్రదాయంలో పెళ్లి పవిత్రంగా భావిస్తారు కనుక అత్యంత వైభవంగా నిర్వహించాలని కోరుకుంటారు. లైఫ్ లో గుర్తుండిపోయే మూమెంట్ కాబట్టి వెడ్డింగ్ గ్రాండ్ గా చేసుకోవాలని అందరూ భావిస్తారు. అందుకు ఖర్చులు కూడా ఎక్కువే. ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సరైన సమయంలో డబ్బులు అందక వడ్డీ వ్యాపారుల వలలో పడతారు. లేదంటే స్థిరాస్తులు అమ్ముకుని రోడ్డున పడతారు. ప్రస్తుతం ఇలాంటి వారికి వెడ్డింగ్ లోన్ ఇస్తోంది ఓ సంస్థ. అయితే ఇప్పటివరకు వెడ్డింగ్ లోన్ విని ఉండరు..
పర్సనల్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్, కార్ లోన్ తోపాటు పలు రకాల లోన్లు తీసుకునే ఉంటారు. కానీ ఫైనాన్స్ దిగ్గజం బజాబ్ ఫిన్ సర్వ్ సంస్థ రూ.25 లక్షల వరకు వెడ్డింగ్ లోన్ అందించి సులభతరమైన ఈఎంఐ అవకాశం కల్పిస్తోంది. ఇక పెళ్లి అనగానే ఆభరణాలు, దుస్తులు, క్యాటరింగ్, పెళ్లి వేదికలు ఇలా ఎన్నో అవసరాలు ఉంటాయి. వీటన్నింటిని తీర్చుకోవడానికి ఈ లోన్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ లోన్ పొందడానికి సదరు సంస్థ కొన్ని నియమాలను సూచించింది. భారతీయుడై ఉండి.. 23 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. అలాగే పబ్లిక్, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తూ ఉండాలి.

flexi personal loan help you arrange funds for your marriage
Wedding Loan : అర్హతలు ఇవే..
గరిష్టంగా 60 నెలల్లో ఈ రుణాన్ని తిరిగి చెల్లించే సదుపాయం ఉంది. ఈ లోన్ పొందాలనుకునే వారు నివసిస్తున్న నగరంలో పాటు శాలరీ ఆధారంగా లోన్ మంజూరు చేయబడతుంది. అలాగే సిబిల్ స్కోర్ కచ్చితంగా 750కి పైన ఉంటేనే లోన్ వస్తుంది. ఉద్యోగులు, బిజినెస్ చేసే వారు ఎవరైనా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. కొన్ని డాక్యుమెంట్లతోనే సులభంగానే ఎలాంటి తనఖా లేకుండా లోన్ తీసుకునే అవకాశం బజాజ్ ఫిన్‌సర్వ్ కల్పిస్తోంది. ఈ లోన్ పొందాలంటే ఆన్ లైన్ లో కానీ దగ్గరలోని బ్రాంచ్ కాని వెళ్లి అప్లయ్ చేసుకోవచ్చు. తక్కువ వడ్డీతో ఈఎంఐల ద్వారా లోన్ అమౌంట్ ని తిరిగి చెల్లించుకోవచ్చు.