Flight Ticket Offers | ఒక్కసారి అయినా విమానం ఎక్కాలని కలలు కన్నవారికి శుభవార్త.. ఇండిగో గ్రాండ్ ఆఫర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Flight Ticket Offers | ఒక్కసారి అయినా విమానం ఎక్కాలని కలలు కన్నవారికి శుభవార్త.. ఇండిగో గ్రాండ్ ఆఫర్

 Authored By sandeep | The Telugu News | Updated on :16 September 2025,9:00 pm

Flight Ticket Offers | విమానం ఎక్కడం చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మందికి కల. అయితే టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో ఆ కల కలగానే మిగిలిపోతుంది. ఇప్పుడు ఆ కలను నిజం చేసే అవకాశం ఇండిగో (IndiGo Airlines) కల్పించింది. “గ్రాండ్ రన్‌వే ఫెస్ట్” పేరుతో ఒక భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఒకవైపు టికెట్ ధరలు కేవలం ₹1299 నుంచి ప్రారంభం అవుతుండగా, అంతర్జాతీయ ప్రయాణాల కోసం ₹4599 నుంచి ఫేర్‌లు మొదలవుతున్నాయి. ఇది ఎకానమీ క్లాస్ ప్రయాణానికి వర్తిస్తుంది.

#image_title

ఇలా బుక్ చేసుకోండి..

ఆఫర్ ప్రారంభం: సెప్టెంబర్ 15, 2025, బుకింగ్ చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2025, ప్రయాణానికి అనుమతించే కాలం: జనవరి 7, 2026 నుంచి మార్చి 31, 2026 వరకు. ఎకానమీ ఫేర్‌లు: ₹1299 నుంచి. అంతర్జాతీయ ఫేర్‌లు: ₹4599 నుంచి, బిజినెస్ క్లాస్ ప్రయాణం కోసం: ₹9999 ప్రారంభ ధర.

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇది గొప్ప అవకాశమే. ముఖ్యంగా ఈ రూట్లు ఈ ఆఫర్ కింద ఉన్నాయి:
కడప – హైదరాబాద్, కడప – విజయవాడ, కడప – చెన్నై, చెన్నై – కడప, జగదల్‌పూర్ – హైదరాబాద్, మైసూర్ – హైదరాబాద్, సేలం – హైదరాబాద్, హైదరాబాద్ – సేలం, కొచ్చి – కోజికోడ్, మైసూర్ – చెన్నై, ఢిల్లీ – గ్వాలియర్, కొచ్చి – బెంగళూరు, పుణె – సూరత్, కొచ్చి – గోవా. ఈ ఆఫర్ పొందాలంటే ఇండిగో అధికారిక వెబ్‌సైట్ (www.goindigo.in) లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి. అంతేకాకుండా, ఇండిగో వాట్సాప్ నంబర్ +91 7065145858 ద్వారా కూడా బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది