Empty Stomach : ఖాళీ కడుపున తొందరపడి ఈ ఆహారం తిన్నారో అంతే సంగతులు?
Empty Stomach : ఖాళీ కడుపు ఎప్పుడుంటుంది. ఉదయం లేవగానే.. మన కడుపు ఖాళీ అవుతుంది. రాత్రి తిన్నది ఏదైనా ఉన్నా అప్పటికే అరిగిపోతుంది. మోషన్ కూడా పోయి వస్తే.. ఇక కడుపు ఖాళీ అయిపోయినట్టే. అందుకే.. ఉదయం తీసుకునే ఆహారం మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే.. అప్పుడు కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి.. ఏది పడితే అది తింటే.. అది ఎన్నో సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.
అయితే.. కొందరు ఉదయం పూట ఏది పడితే అది తినేస్తుంటారు. దాని వల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటారు. ఇంకొందరైతే.. బరువు తగ్గాలనో.. ఫిట్ నెస్ మెయిన్ టెన్ చేయాలనో.. అసలు ఉదయం పూట ఏం తినరు.
ఖాళీ కడుపుతోనే మధ్యాహ్నం దాకా ఉండి.. అప్పుడు డైరెక్ట్ గా మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఇదైతే చాలా డేంజర్. అలా చేస్తే బరువు తగ్గడం పక్కన పెట్టి.. లేనిపోని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడమే అవుతుంది.
Empty Stomach : ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తినకూడని ఆహారం ఏంటి?
ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు జంక్ ఫుడ్ అస్సలు తినకూడదు. కొందరైతే ఉదయం లేవగానే టీ తాగుతారు. అది చాలా డేంజర్. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు టీ తాగడం కంటే.. ఏదైనా తిన్నాక టీ తాగడం బెటర్. లేదంటే టీ వల్ల కలిగే దుష్పరిణామాలు.. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటాయి.
ఉదయం పూట తినే ఆహారంలో కారం ఎక్కువగా ఉండకూడదు. కారం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తింటే.. కడుపు మండుతుంది. అల్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే.. ఉదయం పూట కారం తక్కువగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.
ఉదయం పూట.. కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ మానేసి.. కారం తక్కువగా ఉన్న ఆహారం, తేలికగా జీర్ణం అయ్యే ఆహారం తినాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించేవారు అయితే.. ఉదయం పూట మొలకెత్తిన గింజలు తింటే చాలా మంచిది. ఉడికించిన కూరగాయలు తిన్నా కూడా మంచిదే. ఆ తర్వాత యథావిథిగా మధ్యాహ్న భోజనాన్ని తీసుకోవచ్చు. అయితే.. ఉదయం పూట ఏది తిన్నా కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. మధ్యాహ్నం వరకు తినకున్నా కూడా.. ఆకలి కాకుండా ఉండేలా ఎక్కువ తింటే ఆరోగ్యానికి కూడా మంచిది.
అలాగే.. ఉదయం లేచిన తర్వాత గంట గడిచిన వెంటనే ఏదో ఒకటి తినేయాలి. ఎందుకంటే.. రాత్రి నుంచి కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి.. ఉదయం తినే అల్పాహారాన్ని కొంచెం త్వరగా తింటే అనారోగ్య సమస్యలను తప్పించుకోవచ్చు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అల్పాహారాన్ని ముగించుకొని ఎవరి పనులు వాళ్లు చేసుకుంటే బెటర్.