Free AI Courses: సింపుల్ గా ఏఐ కోర్సులు నేర్చుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీరు ఇది చూడాలసిందే..!!
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రతి రంగంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నందున, విద్యార్థులు, ఉద్యోగులు దీన్ని నేర్చుకోవడం చాలా అవసరమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్వయం (SWAYAM) పోర్టల్ ద్వారా ఐదు ఉచిత ఏఐ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటి వద్ద నుంచే నాణ్యమైన విద్యను పొందేలా ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల ప్రొఫెసర్లు ఈ కోర్సులను రూపొందించారు. దీంతో ఖరీదైన ప్రైవేట్ శిక్షణ అవసరం లేకుండా అందరికీ ఏఐ నేర్చుకునే అవకాశం లభిస్తోంది.

Free AI Course
స్వయం అనేది “స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్” అనే అర్థం కలిగిన ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం. భారత ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ వేదికలో ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, హ్యూమానిటీస్, సైన్సెస్ వంటి విభిన్న సబ్జెక్టులపై కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీడియో లెక్చర్లు, స్టడీ మెటీరియల్, సెల్ఫ్ టెస్ట్‌లు, ఆన్‌లైన్ డిస్కషన్ ఫోరమ్‌లతో ఇది పూర్తిస్థాయి విద్యా వేదికగా పనిచేస్తోంది. సమానమైన, నాణ్యమైన విద్యను అందరికీ చేరవేయడమే దీని ముఖ్య ఉద్దేశం.
ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఏఐ కోర్సుల్లో “పైథాన్‌తో AI/ML”, “AIతో క్రికెట్ అనలిటిక్స్”, “ఫిజిక్స్‌లో AI”, “కెమిస్ట్రీలో AI”, “అకౌంటింగ్‌లో AI” ఉన్నాయి. వీటిలో ప్రోగ్రామింగ్, డేటా సైన్స్, ల్యాబ్ యాక్టివిటీలు, రియల్ లైఫ్ అప్లికేషన్లతో కలిపి ప్రాక్టికల్ నాలెడ్జ్ అందిస్తారు. క్రీడలు, సైన్స్, కామర్స్ వంటి విభిన్న రంగాల్లో ఏఐని ఎలా ఉపయోగించాలో ఈ కోర్సులు స్పష్టత ఇస్తాయి. చదువులో ఉన్నవారికి, ఉద్యోగ అవకాశాల కోసం సిద్ధమవుతున్నవారికి ఇవి ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు.