కొంపముంచిన ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణా హామీ ఎఫెక్ట్.. ఆడవాళ్లకు మందు ఫ్రీ..!!
మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధికమైన మెజార్టీతో గెలవడం తెలిసిందే. అయితే హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పలు సంచలన హామీలు ఇవ్వడం జరిగింది. వాటిని నెరవేర్చే దిశగా ఇప్పుడు ముందడుగులు వేస్తోంది. ఇచ్చిన హామీలలో కర్ణాటకలో ఉన్న మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ ఫ్రీ హామీ ఇవ్వడం తెలిసిందే. అయితే ఈ హామీ ఇప్పుడు కర్ణాటకలో ఉన్న పురుషులకు కొంపముంచినట్లు వార్తలు వస్తున్నాయి.
మేటర్ లోకి వెళ్తే ఉచిత బస్సు ప్రయాణ హామీ కారణంగా చిన్నచిన్న పనులకు కూడా ఆడవాళ్లు ఇల్లు, వాకిళ్లు, పిల్లలను వదిలేసి బస్సు ఎక్కేస్తున్నారట. దీంతో పురుషులు తమ ఇంటిని పిల్లలను చూసుకోవటానికి సాయంత్రం పూట వేగంగా ఇంటికి వచ్చేసే పరిస్థితి నెలకొందట. ఈ పరిణామంతో కర్ణాటకలో బార్లు, రెస్టారెంట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి అంట. ఇటువంటి పరిస్థితులలో నిర్వాహకులు అనేక నష్టాలు చవిచూస్తూ ఉండటంతో.. ప్రభుత్వ హామీలు మాదిరిగానే మహిళలకు మందు ఫ్రీ అని ప్రకటనలు చేసే పరిస్థితి నెలకొందట.
అంతకుముందు కర్ణాటకలో పనివేళలం ముగిసిన తర్వాత బార్లు మరియు రెస్టారెంట్లు మగవాళ్ళతో కిటకిటలాడేవి అంట. అయితే ఉచిత హామీ పథకం ఇంట్లో ఉన్న ఆడవాళ్లను వీధిలోకి తీసుకెళ్తున్నట్లు… దీంతో ఉద్యోగం అయిన వెంటనే మగవాడు ఇంటికి త్వరగా చేసుకునేటట్టు పరిస్థితి కల్పించినట్లు వార్తలు వస్తున్నాయి.