Ys Jagan : డిల్లీ పీఠాన్ని కదిలించనున్న జగన్ , సౌత్ ఇండియా లో కొత్త కూటమి..?
ప్రధానాంశాలు:
Ys Jagan : డిల్లీ పీఠాన్ని కదిలించనున్న జగన్ , సౌత్ ఇండియా లో కొత్త కూటమి..?
Ys Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద పొలిటికల్ డిస్కషన్‌కు దారితీసింది. మురుగప్పన్ గ్రూప్ అమ్మాయికి, వైఎస్ కుటుంబానికి చెందిన అబ్బాయికి జరిగిన ఈ వివాహానికి సౌత్ ఇండియాలో ఉన్న టాప్ లీడర్లంతా హాజరయ్యారు. అయితే అక్కడ జరిగిన పెళ్లి కంటే కూడా, జగన్ అక్కడ ఉన్న నాయకులతో జరిపిన సంభాషణలే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అలాగే రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన అగ్ర హీరో విజయ్‌తో జగన్ చాలా సేపు ఏకాంతంగా చర్చలు జరపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మామూలుగా అయితే ఇలాంటి వేడుకల్లో పలకరింపులు ఉంటాయి కానీ, జగన్ వీళ్లతో చాలా క్లోజ్‌గా, సీరియస్‌గా ఏదో విషయం గురించి మాట్లాడుతున్న విజువల్స్ బయటకు రావడంతో 2029 ఎన్నికల కోసం ఇప్పుడే ఏదైనా మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
Ys Jagan : డిల్లీ పీఠాన్ని కదిలించనున్న జగన్ , సౌత్ ఇండియా లో కొత్త కూటమి..?
Ys Jagan : ఎక్కడ మొదలైంది ఈ వార్త
నిజానికి జగన్ మొదటి నుంచి అటు బీజేపీకి గానీ, ఇటు కాంగ్రెస్‌కు గానీ డైరెక్ట్‌గా మద్దతు ఇవ్వకుండా తనదైన శైలిలో రాజకీయం చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటూనే ప్రాంతీయ పార్టీల బలాన్ని పెంచే దిశగా ఆలోచిస్తుంటారు. ఇప్పుడు చెన్నైలో జరిగిన ఈ భేటీ చూస్తుంటే, అటు ఎన్డీఏకు, ఇటు యూపీఏకు ప్రత్యామ్నాయంగా ఒక బలమైన దక్షిణాది కూటమిని ఏర్పాటు చేసే ఆలోచన ఏమైనా ఉందా అనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కేసీఆర్‌తో జగన్‌కు మంచి రాపో ఉంది, అటు మమతా బెనర్జీతో కూడా పాత పరిచయాలు ఉన్నాయి. వీళ్లందరినీ కలుపుకుని ప్రాంతీయ పార్టీలన్నీ ఒక తాటిపైకి వస్తే, భవిష్యత్తులో ఢిల్లీ పీఠాన్ని కదిలించే స్థాయికి ఈ కూటమి వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పెళ్లి వేడుకలో విజయ్‌తో జగన్ మాట్లాడిన తీరు చూస్తుంటే, రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడే వస్తున్న విజయ్‌కు జగన్ తన అనుభవాన్ని షేర్ చేస్తున్నారేమో అని కొందరు అనుకుంటున్నారు. ఏదేమైనా ఒక పెళ్లి వేడుకను వేదికగా చేసుకుని జగన్ ఇంత పెద్ద స్థాయిలో పొలిటికల్ వైబ్స్ క్రియేట్ చేయడం నిజంగా విశేషమే. ఈ పరిణామాలు గమనిస్తుంటే రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల మధ్య కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. వైసీపీ, డీఎంకే, టీవీకే, బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ శక్తులన్నీ కలిస్తే జాతీయ రాజకీయాల్లో సౌత్ ఇండియా వాయిస్ గట్టిగా వినిపించే అవకాశం ఉంది. మరి ఈ “చెన్నై మీటింగ్” భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.