Gadapa Gadapa Program : గడప గడపకు కార్యక్రమానికి నిరసన సెగ.. సొంత జిల్లాలో జగన్ కు షాకిచ్చిన ప్రజలు

Gadapa Gadapa Program : కడప జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా. అంతే కాదు.. అది వైసీపీకి కంచుకోట. అవును ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కంచుకోటగా ఉన్న కడప జిల్లా.. ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా మారింది. ఆ జిల్లాలో ప్రజలంతా వైసీపీ పాలనపై ఖచ్చితంగా పాజిటివే ఉండాలి. కానీ.. ఇక్కడ మాత్రం పరిస్థితులు అలా లేవు. కడప జిల్లాలో ఉన్న

మైదుకూరులో ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం ఆనే కార్యక్రమానికి నిరసన సెగ తగిలింది.మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. తన నియోజకవర్గంలోని నర్శిరెడ్డిపల్లె అనే గ్రామంలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే.. ఎమ్మెల్యే వస్తున్నారని ముందే తెలుసుకున్న ఆ గ్రామ ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.

gadapa gadapa program in ap by ycp government

Gadapa Gadapa Program : 420 ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయిన ప్రజలు

ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకొని ఆ ఊళ్లో ఉన్న 420 ఇళ్లకు ప్రజలంతా తాళాలు వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షాక్ అయ్యారు. ఒకరిద్దరు గ్రామ పెద్దలు అక్కడ ఉండి ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు తెలియజేశారు. మాకు కనీసం రోడ్లు కూడా వేయలేదు. అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వలేదు. అందుకే గ్రామస్తులు ఆగ్రహంతో ఉన్నారని గ్రామ పెద్దలు చెప్పుకొచ్చారు. గ్రామంలో ఎవ్వరూ లేకపోవడంతో ఎమ్మెల్యే కూడా అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. అయితే.. సీఎం జగన్ సొంత జిల్లాలో ఇలా పార్టీకి, ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంపై పలువురు పలురకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Recent Posts

Lungs | ప్రజలకు హెచ్చరిక.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయోద్దు..!

Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…

16 minutes ago

Sabudana | నవరాత్రి ఉపవాసంలో సబుదాన ఎక్కువ తినొద్దు ..నిపుణుల హెచ్చరిక

Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…

1 hour ago

Knee Pain | తరచుగా మోకాళ్ల నొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయొద్దు .. వైద్య నిపుణుల హెచ్చరిక

Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…

2 hours ago

Curry Leaf Plant| కరివేపాకు మొక్కని పెంచుకునే విషయంలో ఈ త‌ప్పులు చేస్తే స‌మ‌స్య‌లు తప్పవు..!

Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…

3 hours ago

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

12 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

13 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

15 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

17 hours ago