Home » Entertainment » Veera Simha Reddy Movie First Day Collections
Entertainment

veera Simha Reddy Movie : బాలకృష్ణ వీర సింహరెడ్డి ఫస్ట్ డే కలెక్షన్స్.. దుమ్ము దులిపేశాడుగా..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 13, 2023 7:18 pm
Advertisement

veera Simha Reddy Movie : సంక్రాంతి కానుకగా వచ్చిన బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘ సినిమా భారీ అంచనాలతో విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. ఈ సినిమా రిలీజ్ కి ముందే అదిరిపోయే ప్రీ రిలీజ్ బజ్ తెచ్చుకుంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. దీంతోపాటు బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో తో పాపులారిటీని పెంచుకున్నాడు.

Advertisement

బాలయ్యకు సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి సినిమా టైంలో ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు వీర సింహారెడ్డి సినిమాకి కూడా అంతే క్రేజ్ ఏర్పడింది. ఎక్కడ చూసినా జై బాలయ్య అనే నినాదం వినపడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా వీరసింహారెడ్డి సినిమా వసుళ్ళ పరంగా దుమ్ములేపుతుంది. మొదటి రోజే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో తెలుగు పరిశ్రమలోనే సరికొత్త రికార్డును సృష్టించింది. లిమిటెడ్ టికెట్ ధరలలో కూడా అత్యధిక వసూళ్లను రాబట్టడంతో ఇండస్ట్రీ షాక్ అవుతుంది. ఫస్ట్ డే ఆర్టీసీ క్రాస్ రోడ్ థియేటర్లో ఏకంగా 43 లక్షలకు పైగా వసూలు రాబట్టింది.

veera Simha Reddy Movie First Day Collections

Advertisement

ఇది టాలీవుడ్ లోనే సరికొత్త రికార్డు అంటూ ప్రశంసిస్తున్నారు. భారీ సినిమాలకు పోటీగా బాలయ్య సినిమా కలెక్షన్స్ సాధించింది. పైగా భారీ సినిమాలకు టికెట్ రేట్లు చాలా ఎక్కువ. లిమిటెడ్ టికెట్లు రేట్ల తోని ఈ స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టింది. ఒకవేళ టికెట్ రేట్లను పెంచితే ఆల్ టైం బిగ్గెస్ట్ సినిమాగా వీరసింహారెడ్డి సినిమా నిలిచేది. మొదటి రోజు 43 లక్షల పైగా వసూళ్లను రాబట్టిందంటే బాలయ్య రేంజ్ మామూలుగా లేదని తెలిసిపోతుంది. ఏది ఏమైనా బాలయ్య ఈ వయసులో కూడా మాస్ సినిమాలు చేస్తూ దుమ్ము లేపుతున్నాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి