Ganesh Nimajjanam | ఈసారి అనంత చతుర్దశి .. గణపతి నిమజ్జనంలో తప్పక పాటించాల్సిన నియమాలు!
Ganesh Nimajjanam | ఈ సంవత్సరం అనంత చతుర్దశి సెప్టెంబర్ 6న జరుపుకోనున్నారు. గణేశ చతుర్థి సందర్భంగా పది రోజుల పాటు భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో గణపతిని పూజించి, అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేసి వీడ్కోలు పలుకుతారు. ఈ నిమజ్జన వేళ, ఒక్కో క్షణం భావోద్వేగంగా ఉంటుంది. కానీ భక్తిగా గణపతికి వీడ్కోలు పలికేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. చిన్నచిన్న తప్పులు కూడా పాపానికి దారి తీస్తాయని నమ్మకం ఉంది.

#image_title
ఈ గణేశ నిమజ్జనం సందర్భంగా చేయకూడని కొన్ని తప్పులు ఇక్కడ తెలుసుకుందాం
1. నీటిని కలుషితం చేయవద్దు
గణపతి విగ్రహాలను నేరుగా చెరువులు, నదుల్లో నిమజ్జనం చేయకండి. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా, ఇప్పుడు కృత్రిమ నీటి ట్యాంకులలో లేదా ఇంట్లో నిమజ్జనం చేసే సంప్రదాయం పెరుగుతోంది. దీనివల్ల నీటి కాలుష్యం జరగదు.
2. పగిలిన విగ్రహాన్ని నిమజ్జనం చేయొద్దు
నిమజ్జనానికి తీసుకెళ్తూ విగ్రహం పగలకుండా జాగ్రత్త వహించాలి. పగిలిన విగ్రహాన్ని నదిలో వేసే పద్ధతి శుభకరం కాదు అనే నమ్మకం ఉంది.
3. పూర్తి పూజ చేయకపోవడం
నిమజ్జనానికి ముందు గణేశునికి సంపూర్ణ పూజ చేయాలి. హారతి ఇచ్చి, మోదకాలు, లడ్డూలు, పుష్పాలు సమర్పించాలి. ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలి.
4. విగ్రహాన్ని నేరుగా నీటిలో వేయకండి
విగ్రహాన్ని నీటిలో పడేయకూడదు. ముందు మూడు సార్లు జలంలో ముంచి, అలా అంచెలంచెలుగా నెమ్మదిగా నీటిలో కలపాలి.
5.మత్తు పదార్థాలు సేవించవద్దు
నిమజ్జన రోజున మత్తు పదార్థాలను దూరంగా ఉంచాలి. సాత్వికంగా, పవిత్రమైన ఆచారాలతో గణపతికి వీడ్కోలు చెప్పాలి.
6. పూజా సామాగ్రిని నీటిలో వేయవద్దు
పూజలో ఉపయోగించిన పూలు, దండలు, బట్టలు, కొబ్బరికాయలు, మిఠాయిలను నదిలో వేయడం తగదు. ఇవన్నీ ఒక శుభ్రమైన ప్రదేశంలో విడిచి పెట్టాలి లేదా తగిన రీతిలో విసర్జించాలి.
7. నిమజ్జనం తర్వాత వెనక్కి తిరిగి చూడకండి
నిమజ్జనం పూర్తయ్యాక వెనక్కి తిరిగి చూడకూడదని ఒక నమ్మకం ఉంది. వచ్చే సంవత్సరం తిరిగి రావాలని ఆహ్వానం పలుకుతూ గణపతికి వీడ్కోలు చెప్పాలి.