Ganta Srinivasa rao : అమ్మ గంటా… నీ చావు తెలివి తేటలు మామూలుగా లేవుగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ganta Srinivasa rao : అమ్మ గంటా… నీ చావు తెలివి తేటలు మామూలుగా లేవుగా

Ganta Srinivasa rao : ఏపీలో ఒక వైపు వైజాగ్ స్టీల్‌ కు సంబంధించిన చర్చ జరుగుతుంటే మరో వైపు పెద్ద ఎత్తున పంచాయితీ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న విషయం తెల్సిందే. వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రతి ఒక్క పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ వారు నినదిస్తున్నారు. తమకు ఉన్న హక్కును ఏ ఒక్కరు కాదనలేరు అంటూ చేస్తున్న వ్యాఖ్యలతో మారుమ్రోగిపోతుంది. ఇక ఈ వివాదంను కొందరు తమకు అనుకూలంగా […]

 Authored By himanshi | The Telugu News | Updated on :13 February 2021,11:30 am

Ganta Srinivasa rao : ఏపీలో ఒక వైపు వైజాగ్ స్టీల్‌ కు సంబంధించిన చర్చ జరుగుతుంటే మరో వైపు పెద్ద ఎత్తున పంచాయితీ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న విషయం తెల్సిందే. వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రతి ఒక్క పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ వారు నినదిస్తున్నారు. తమకు ఉన్న హక్కును ఏ ఒక్కరు కాదనలేరు అంటూ చేస్తున్న వ్యాఖ్యలతో మారుమ్రోగిపోతుంది. ఇక ఈ వివాదంను కొందరు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గంటా శ్రీనివాస్ వంటి వారు రాజకీయ మైలేజీ కోసం దీనిని వాడుకుంటున్నారు అంటూ స్వయంగా ఆయన పార్టీ నాయకులు గుసగుసలాడుకోవడం జరుగుతుంది.

MLA Ganta Srinivasa rao resignation is a big dram called ysrcp

MLA Ganta Srinivasa rao resignation is a big dram called ysrcp

Ganta Srinivasa rao : పనిచేయని రాజీనామా..

కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోతున్నట్లుగా నిర్ణయం బయటకు వచ్చిన వెంటనే తాను రాజీనామా చేసి కార్మికులతో పోరాటం చేసేందుకు సిద్దం అవుతాను అంటూ ప్రకటించాడు. అబ్బో గంటా శ్రీనివాస్‌ రాజీనామా చేశాడే ఆయన వైజాగ్ ఉక్కు కంపెనీ పట్ల ఎంత నిబద్దతతో ఉన్నాడు అంటూ అంతా అభినందించారు. తీరా చూస్తే ఆ రాజీనామా స్పీకర్‌ ఫార్మట్‌ లో లేదు. దాంతో దాన్ని స్పీకర్‌ తిరష్కరించారు. ఏంటయ్యా గంటా ఇది అంటూ కార్మికులు ప్రశ్నించడంతో ఈసారి సరిగా రాజీనామా చేస్తాను అంటూ గంటా శ్రీనివాస్ తన రాజీనామా లేఖను మళ్లీ రాశాడు. అయితే మళ్లీ కూడా స్పీకర్‌ ఫార్మట్‌ లో రాజీనామా లేదు అంటూ తిరష్కరించడం జరిగింది

గంటా రాజీనామా డ్రామా క్లైమాక్స్‌కు…

గంటా శ్రీనివాస్‌ తన రాజీనామా లేఖను మరోసారి స్పీకర్‌ కు పంపించాడు. మూడు సార్లు రాజీనామా లేఖను రాసిన గంటా శ్రీనివాస్ డ్రామాలు ఏమైనా ఆడుతున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎట్టకేలకు ఆయన అంతా సవ్యంగా రాజీనామా లేఖను రాశాడు. ఈసారి ఆయన రాసిన రాజీనామా లేఖ ఖచ్చితంగా ఆమోదం పొందుతుందని ఆయన సన్నిహితులు అంటున్నారు. రాజీనామా ప్రచారంతో జనాల్లో మంచి మైలేజ్ అయితే వచ్చింది. మళ్లీ ఉప ఎన్నికలు వస్తే ఆయనే గెలిచి ఎమ్మెల్యే అవుతాడు. అంతటి దానికి ఎందుకు ఈ రాజీనామాలు తతంగం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

MLA Ganta Srinivasa rao resignation is a big dram called ysrcp

MLA Ganta Srinivasa rao , Ganta Srinivasa rao , ysrcp, Ganta Srinivasa rao resignation, గంటా శ్రీనివాస్‌, ys jagan, bjp, tdp,

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది