Ganta Srinivasa rao : అయ్యో గంటా… రెంటికి చెడ్డ రేవడి మాదిరిగా మిగిలి పోయావే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ganta Srinivasa rao : అయ్యో గంటా… రెంటికి చెడ్డ రేవడి మాదిరిగా మిగిలి పోయావే

Ganta Srinivasa rao : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి మాదిరిగా తయారు అయ్యింది. ఈయన గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసి వైకాపా సునామీని కూడా తట్టుకుని నిల్చుని గెలిచాడు. తన ప్రాభవంను నిలుపుకున్న గంటా శ్రీనివాసరావు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గత ఏడాది కాలంగా వార్తలు వస్తున్నాయి. బీజేపీతో ఈయన క్లోజ్‌గా ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి. బీజేపీలో జాయిన్‌ అయ్యే అవకాశం […]

 Authored By himanshi | The Telugu News | Updated on :14 February 2021,10:53 am

Ganta Srinivasa rao : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి మాదిరిగా తయారు అయ్యింది. ఈయన గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసి వైకాపా సునామీని కూడా తట్టుకుని నిల్చుని గెలిచాడు. తన ప్రాభవంను నిలుపుకున్న గంటా శ్రీనివాసరావు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గత ఏడాది కాలంగా వార్తలు వస్తున్నాయి. బీజేపీతో ఈయన క్లోజ్‌గా ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

బీజేపీలో జాయిన్‌ అయ్యే అవకాశం ఉందని కొన్నాళ్లు లేదు వైకాపాలో ఆయన జాయిన్‌ అవ్వబోతున్నాడు అంటూ మరి కొందరు వ్యాఖ్యలు చేశారు. ఎట్టకేలకు ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకుని టీడీపీకి దూరం అవ్వడం అప్పుడప్పుడు మెల్ల మెల్లగా టీడీపీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం చేస్తూ ఉండేవాడు. ఆయన వ్యాఖ్యలను టీడీపీ ఇప్పటి వరకు చూసి చూడనట్లుగానే వదిలేసింది. అయితే ఇప్పుడు గంటా బీజేపీలో జాయిన్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

Ganta Srinivasa rao : వైకాపాలోకి వద్దే వద్దు..

ఏపీలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌ పరం చేసింది. దాంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ కేంద్రంపై పోరాటంకు సిద్దం అయ్యాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తీవ్ర విమర్శలు చేయడంతో పాటు మరోసారి పెద్ద ఎత్తున విశాఖ ఉద్యమంకు ఊపిరి పోసి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేస్తానంటూ చాలా నమ్మకంగా బలంగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో గంటా బీజేపీలో చేరడం అనేది సాధ్యం అయ్యే విషయం కాదు. ఇక ఆయనకు మిగిలి ఉన్న దారి వైకాపా అంటున్నారు. అయితే వైకాపాలోకి ఆయన్ను రానిచ్చేది లేదు అంటూ ఆ పార్టీ నాయకులు కొందరు బలంగా వైఎస్‌ జగన్‌ ను డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంటా ఏం చేయబోతున్నాడు అనేది ఆసక్తిగా మారింది.

Ganta Srinivasa rao political career in dailama

Ganta Srinivasa rao political career in dailama

Ganta Srinivasa rao : ఒకే ఒక్క ఛాన్స్‌ జనసేన..

చంద్రబాబు నాయుడుతో గత కొన్ని నెలలుగా డైరెక్ట్‌ కాంటాక్ట్‌ లేకపోవడంతో ఖచ్చితంగా ఆయన టీడీపీని వదలడం మాత్రం ఖాయం అని రాజకీయ వర్గాల వారు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో గంటా శ్రీనివాస్‌ మళ్లీ ఆయన వద్దకు వెళ్లి పార్టీలో ఉంటాను అని చెప్పలేని పరిస్థితి. అందుకే ఆయన ఖచ్చితంగా పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో గంటా ఏ పార్టీలో జాయిన్‌ అవుతాడు అనేది చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం రెండు పార్టీలు కూడా ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. కనుక మిగిలి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్‌ గంటా జనసేనలో జాయిన్‌ అవ్వడం. గంటా శ్రీనివాసరావుకు మెగా పార్టీ కొత్తేం కాదు. గతంలో చిరంజీవి పార్టీలో ఉన్న విషయం తెల్సిందే. ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్‌ కు ఛాన్స్‌ ఉందని అంటున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది