Gautam Gambhir : హెడ్ కోచ్‌గా గంభీర్.. బాబోయ్ మనోడి డిమాండ్స్ వింటే బిత్తర పోవల్సిందే..!
Gautam Gambhir : గౌతమ్ గంభీర్.. టీమిండియా విజయాలలో ముఖ్య భూమిక పోషించాడు.టీమిండియాను రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్ ఇప్పుడు కోచ్‌గా భారత జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు రాబోయే రెండేళ్లు టీమిండియాకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అని బీసీసీఐ అఫీషియల్‌గా ప్రకటించింది. దాదాపు 7 ఏళ్ల 8 నెలల సుదీర్ఘ విరామం తర్వాత గౌతమ్ గంభీర్ మరోసారి టీమిండియా జట్టులోకి అడుగుపెట్టబోతున్నాడు. అయితే ఈసారి వేరే బాధ్యతలతో డ్రెస్సింగ్ రూమ్‌లోకి వస్తున్నాడు. షించిన రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని గంభీర్ భర్తీ చేయనున్నాడు. ఈ నెలాఖరున ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటన నుంచి గంభీర్ యాక్షన్ మొదలుకానుంది.
2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతను కోచ్ పదవిలో ఉంటాడు. అప్పటివరకు భారత అయిదు ఐసీసీ టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, అలాగే 2025లోనే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉంటుంది. 2026లో టీ20 వరల్డ్ కప్, ఆ తర్వాత 2027లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే మహా సమరం జరుగుతాయి.ఈ క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్‌ను టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా గంభీర్ ఎంపిక చేసినట్లు సమాచారం. కేకేఆర్ తరఫున గత ఐపీఎల్ సీజన్‌లోనూ వీరిద్దరు కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. టీమిండియా బాధ్యతల నిర్వహణపై వీరిద్దరు ఓ అంచనాకు కూడా వచ్చారని తెలిసింది. దీంతో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్‌కు నిరాశే మిగలనుంది.
Gautam Gambhir : హెడ్ కోచ్‌గా గంభీర్.. బాబోయ్ మనోడి డిమాండ్స్ వింటే బిత్తర పోవల్సిందే..!
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవడంలో మెంటార్‌గా గంభీర్‌ది కీలకపాత్ర. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ దూకుడు ఫార్ములాతో జట్టును సిద్ధం చేయడంలో గంభీర్ నేర్పరి. ఇప్పుడు ఐపీఎల్ నుండి తప్పుకోవడంతో గంభీర్ తన జీతం విషయంలో భారీ డిమాండ్స్ పెట్టినట్టు టాక్ వినిపిస్తుంది. రాహుల్ ద్రావిడ్‌కి ఇచ్చే జీతం కన్నా కూడా తనకు ఎక్కువ జీతం ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
This website uses cookies.