Home » Andhra Pradesh » Giddalur Ycp Mla Anna Rambabu Serious Comments On Ttd Eo
andhra pradesh

MLA Anna Rambabu : టిటిడి ఈవోపై ఎమ్మెల్యే అన్నా రాంబాబు గరం గరం..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 27, 2023 7:04 pm
Advertisement

MLA Anna Rambabu : గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు టీటీడీ ఈవో పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనాలు, సౌకర్యాల కల్పనలో ప్రోటోకాల్ ప్రక్రియను టీటీడీ ఈవో మరియు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఒంటెద్దు పోకడలతో.. అటు తిరుమల తిరుపతి దేవస్థానానికి …ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన తిరుమలలో..మీడియాతో మాట్లాడుతూ సామాన్య భక్తులకు సౌకర్యాలు

Advertisement

giddalur ycp MLA Anna Rambabu serious comments on ttd eo

చేపడ్తున్నామనే వంకతో ప్రోటోకాల్ విషయంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై ఇష్టారాజ్యంగా వ్యవహరించడమేమిటని ప్రశ్నించారు. ఏ నిబంధన అయినా ఏ కార్యక్రమమైనా తిరుమలలో పారదర్శకంగా జరిగితే అందరం స్వాగతిస్తాం. కానీ తిరుమలలో ప్రోటోకాల్ ఇంకా దర్శనాలు ఇతర సౌకర్యాల విషయంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి తన సన్నిహితులకు ఒకలాగా మిగతా వారికి మరొక లాగా చూస్తున్నారు ఇది అవమానకరమని అన్నారు.

Advertisement

“నీ వాళ్ళకు, నీ చుట్టాలకు ఒక చట్టం.. ఇతరులకో చట్టమా..?” -టీటీడీ మీ ఎస్టేట్ అనుకున్నారా..? -సిఎంవో సిఫారసును కాదంటారా..? -ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా.. -టీటీడీ ఈఓ ఒంటెత్తు పోకడపై గిద్దలూరు ఎమ్యెల్యే అన్నా రాంబాబు తీవ్ర స్థాయలో మండిపడ్డారు. ఇదే సమయంలో మొన్న టిటిడి అధికారి ఒకరు గంజాయి తాగుతూ … అడ్డంగా దొరకడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు టీటీడీ ఈవో పై వైసీపీ ఎమ్మెల్యే సీరియస్ వ్యాఖ్యలు చేయడం ఈ వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి