Wall Clock | ఇంట్లో గడియారం ఉంచే దిశపై వాస్తు శాస్త్రం ఏమంటోంది.. తప్పులు చేస్తే అదృష్టాన్ని కోల్పోతారట!
Wall Clock | వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ప్రతి వస్తువు స్థానం, దిశ అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా గడియారం (Clock) ఉంచే దిశ విషయంలో నిపుణులు ఇచ్చే సూచనలు మరింత ప్రాధాన్యత కలిగి ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే గడియారం కాలాన్ని సూచించడమే కాదు, మన జీవన శైలిని కూడా ప్రభావితం చేస్తుందట!
#image_title
గడియారానికి అనుకూలమైన దిశలు:
వాస్తు నిపుణుల మాటల్లో…
ఉత్తరం లేదా తూర్పు దిశలో గడియారాన్ని ఉంచడం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది.
ఈ దిశలు సానుకూల శక్తిని కలిగించేలా పనిచేస్తాయని నమ్మకం ఉంది.
దీనివల్ల కుటుంబంలో శాంతి, ఆనందం, ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయని అంటున్నారు.
దక్షిణ దిశలో గడియారం ఉంచొద్దు:
దక్షిణ దిశలో గడియారం ఉంచడం చాలా అశుభం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది పురోగతిని అడ్డుకునే దిశగా పరిగణించబడుతుంది.
వ్యాపారం, ఉద్యోగంలో ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశముందంటున్నారు.
తప్పక తెలుసుకోవాల్సిన ఇతర వాస్తు సూచనలు:
విరిగిన లేదా పనిచేయని గడియారాలు ఇంట్లో ఉంచరాదు.
ఇది ఆగిపోయిన పురోగతికి సంకేతంగా భావిస్తారు. వెంటనే బయటకు తీసేయాలి.
గడియారంపై దుమ్ము పట్టకుండా శుభ్రంగా ఉంచాలి.
దుమ్ముతో ఉన్న గడియారం చెడు కాలానికి సంకేతమట.
గడియారంలో సమయాన్ని వెనక్కి సెట్ చేయకూడదు.
కానీ కొంత ముందుకు సెట్ చేస్తే శ్రేయస్సు వస్తుందట.