Good News : కేంద్ర ప‌థ‌కం బంప‌ర్ ఆఫ‌ర్.. నెల‌కి రూ.30,000 పొంద‌డం ఎలా అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Good News : కేంద్ర ప‌థ‌కం బంప‌ర్ ఆఫ‌ర్.. నెల‌కి రూ.30,000 పొంద‌డం ఎలా అంటే..!

Good News : కేంద్ర ప్ర‌భుత్వం పేద వారి కోసం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పేరుతో కేంద్రం ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా సులువుగా ఆరోగ్య సేవలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న వాళ్లకు కేంద్రం నుంచి గోల్డెన్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 July 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Good News : కేంద్ర ప‌థ‌కం బంప‌ర్ ఆఫ‌ర్.. నెల‌కి రూ.30,000 పొంద‌డం ఎలా అంటే..!

Good News : కేంద్ర ప్ర‌భుత్వం పేద వారి కోసం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పేరుతో కేంద్రం ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా సులువుగా ఆరోగ్య సేవలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న వాళ్లకు కేంద్రం నుంచి గోల్డెన్ కార్డ్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆయుష్మాన్ మిత్ర రిజిస్ట్రేషన్ ద్వారా నెలకు రూ.30000 వరకు పొందే ఛాన్స్ ఉంటుంది.

Good News ఆయుష్మాన్ మిత్ర రిజిస్ట్రేష‌న్..

దేశంలో ఉన్న కోట్లాది మంది భారతీయులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలను అందిచేందుకు మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తున్నారు. హాస్పిటల్స్ లో ఈ పథకం అమలుకు సహాయంగా ఆయుష్మాన్ మిత్రలను పనిచేస్తుంటారు. ఆయుష్మాన్ భారత్ అమలులో సహాయం, లబ్దిదారుల కార్డులను సజావుగా తయారు చేయడం ఇంకా రోగులకు మద్ధతుగా నిలవడం. దీనికి జీతం నెలకు 5000 నుంచి 20000 వేల వరకు ఉంటుంది. ఆయుష్మాన్ మిత్ర అర్హత చూస్తే.. 12 ఉత్తీర్ణత పొంది.. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండి పాధమిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సి ఉంటుంది. స్థానిక భాష ఇంకా హిందీ లేదా ఇంగ్లీష్ లో పరిజ్ణానం ఉండాలి.

రానున్న ఐదేళ్లలో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖలో లక్ష మంది మిత్రల నియామకానికి ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది 20,000 మంది ఆయుష్మాన్ మిత్రలను నియమించనున్నారు. మొదటి దశలో దాదాపు 10,000 మంది ఆయుష్మాన్ మిత్రలను నియమించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ కింద దేశవ్యాప్తంగా 20 వేల ఆసుపత్రులు లిస్టులో ఉన్నాయి. ఇతర పోస్టులలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆయుష్మాన్ మిత్రల కోసం ప్రతి జిల్లాలో ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరీక్షను నిర్వహిస్తుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే ఆయుష్మాన్ మిత్ర పోస్టులో నియమిస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలోని పోస్టుల అవసరాన్ని బట్టి వారిని నియమిస్తారు.

Good News కేంద్ర ప‌థ‌కం బంప‌ర్ ఆఫ‌ర్ నెల‌కి రూ30000 పొంద‌డం ఎలా అంటే

Good News : కేంద్ర ప‌థ‌కం బంప‌ర్ ఆఫ‌ర్.. నెల‌కి రూ.30,000 పొంద‌డం ఎలా అంటే..!

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రచారం చేయాలి.. హాస్పిటల్ విధానాలు, ఆయుష్మాన్ కార్డులను రూపొందించడానికి ప్రజలకు సహాయం చేయాలి. క్యూ.ఆర్ కోడ్ ద్వార ఐడీని ధృవీకరించాలి. దానితో పాటుగా భీమా ఏజెన్సీలకు డేటాని పంపించాల్సి ఉంటుంది. రాత పూర్వక అసైన్ మెంట్ నిర్వహించడం.. ఇంకా ఆధార్ తో డేటా వెరిఫికేషన్ లో సాయాహం చేయడం చేయాలి.అప్లై చేసే విధానం చూస్తే.. అధికారిక వెబ్ సైట్ https://pmjay.gov.in కి వెళ్లాలి. ఆ త‌ర్వాత హోం పేజీలో రిజిస్టర్ చేసుకోవడానికి అన్న దాని దగ్గర క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ ఇంకా మొబైల్ నంబర్ ఇవ్వాలి. అప్లై ని క్లిక్ చేయాలి. మొబైల్ కి ఓటీపీ వస్తుంది. అది అక్కడ ఎంటర్ చేసి కొనసాగించాలి. వివరాలు రిజిస్ట్రేషన్ లో పూర్తించాలి. అవసరమైన పత్రాలను జత చేయాలి. పూర్తైన తర్వాత సబ్ మిట్ చేసి లాగిన్ ఐడి పాస్ వర్డ్ వస్తుంది అది జాగ్రత్తగా ఉంచుకోవాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది