Amazon : ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. విశాఖలో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amazon : ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. విశాఖలో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :19 December 2022,5:20 pm

Amazon : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ విశాఖపట్నం విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. త్వరలో విశాఖ నుండి పరిపాలన చేయనున్నట్లు ఇప్పటికే వైసీపీ నేతలు మీడియా వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖని కొద్దిపాటి అభివృద్ధి చేస్తే రాజధానికి కావలసిన అన్ని … అర్హతలు ఉంటాయని చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి దిగ్గజ కంపెనీలు ఎక్కువగా విశాఖపట్నంలోనే వస్తూ ఉన్నాయి. విశాఖ ఐటీ హబ్ గా తీర్చిదిద్దడానికి

మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ అమెజాన్ ఫెసిలిటీ సెంటర్ విశాఖలో ₹184.12 రూపాయల పెట్టుబడితో అమెజాన్ సంస్థ సిద్ధమయ్యింది. ఈ మేరకు అమెజాన్ పెట్టుబడుల కోసం ప్రాథమిక నిర్ణయం పూర్తయి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో నూతన సంవత్సరంలో నూతన ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు పనులు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వానికి సంస్థ వివరించింది.

Good news for Andhra Pradesh Residents amazon facility Center in Visakhapatnam

Good news for Andhra Pradesh Residents amazon facility Center in Visakhapatnam

ఇక ఇదే విషయాన్ని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్… ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుతో ఐటీ ఉద్యోగులతో పాటు స్థానికంగా కూడా ఉపాధి అవకాశాలు రానున్నాయి. ప్రస్తుతం ఇప్పటికే విశాఖలో విప్రో, టెక్ మహేంద్ర, కండ్యూయెంట్, మిరాకిల్ సిటీ, పాత్ర ఇండియా… వంటి కంపెనీలు రావడం జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖనీ ఒక ఐటీ హబ్ గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తూ ఉంది.

 

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది