EPFO : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ త్వారలోనే ఖాతాదారులకు శుభవార్త చెప్పనుంది. ప్రతిసారి వడ్డీ జమ ఆలస్యమవుతూ వస్తోంది. కానీ.. ఈ సంవత్సరం ముందుగానే పీఫ్ ఖాతాదారుల అకౌంట్లో వడ్డీ జమ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు దేశంలో ఏడు కోట్లకు పైగా ఎంప్లాయీస్ ఖాతాల్లో వడ్డీ అమౌంట్ జమ కానుంది. అయితే గతంలో వడ్డీ 8.5 శాతం అందించగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశమై వడ్డీ 8.1 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వడ్డీని ఖతాదారుల అకౌంట్లలో ఈ సారి ముందుగానే జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే గతంలో కంటే ఈ సారి వడ్డీ శాతాన్ని తగ్గించారు.
2012-13 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 8.75 శాతం, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 8.75 శాతం, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం వడ్డీ చెల్లించారు. 2016-17 సంవత్సరంలో 8.65 శాతం, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.55 శాతం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం చొప్పున వడ్డీ జమ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి మాత్రం 8.1 శాతానికి కుదించి వడ్డీ జమ చేయనుంది.కాగా ఈపీఎఫ్ వో ఉద్యోగుల ఖాతాల్లో జూన్ 16 నుంచి డబ్బు జమ చేయడం ప్రారంభించనుంది.
ప్రతిరోజు 2.5 నుంచి 5 లక్షల మంది ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుంది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.72,000 వేల కోట్ల వడ్డీని జమ చేయనుంది. అయితే ఖాతాదారులు పీఫ్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొదటగా ఈపీఎఫ్ వో వెబ్ సైట్ epfindia.gov.in లో ఓపెన్ చేసి ఈ పాస్‌బుక్‌పై క్లిక్ చేయాలి. దీంతో passbook.epfindia.gov.in అనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి క్లిక్ చేయాలి. ఆ తర్వాత సభ్యుల ఐడీని ఎంచుకుని ఈపీఎఫ్ బ్యాలెన్స్ ని చూడవచ్చు .
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.