Farmers : ప్రతి ఏడాది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి కింద 6000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అయితే ప్రధానమంత్రి ఈ పథకం ద్వారా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వాయిదాలను విడుదల చేస్తారు. అయితే రైతులు ఇప్పటివరకు పీఎం కిసాన్ పథకాన్ని 17 విడతలు గా వాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు 18 వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కానీ కొన్ని పొరపాట్ల వలన ఇతర విడతలు ఆగిపోవచ్చు అని అంటున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం…
పీఎం కిసాన్ యోజన 18వ విడతన పొందేందుకు మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ ని చేయించాలి. మీరు గనక ఇప్పటికీ ఈ కేవైసి పూర్తి చేయకపోతే, ముందుగా మీరు ఈ కేవైసిని పూర్తి చేయండి. లేకపోతే మీకు వచ్చే ఈ 18వ విడత పూర్తిగా రద్దు అవుతుంది. ఈ కేవైసీ చెయ్యకపోవటం వలన 17వ విడత ఆగినట్లయితే ఈసారి వచ్చే 18 తో పాటు 17వ విడత సొమ్ము కూడా మీకు వస్తుంది. అనగా 4000 వస్తాయి అన్నమాట. అయితే ఈ కేవైసీ ప్రక్రియ విషయానికి వచ్చినట్లయితే,PMKisan pmkisan. gov.in అధికారిక వెబ్సైట్ కి వెళ్ళాలి. ఇప్పుడు మీరు హోం పేజీలో ఈ కేవైసీ ఎంపికపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఆధార్ కార్డు యొక్క నెంబర్ మరియు క్యాప్చ కోడ్ ను నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత శోధన అనే ఎంపికపై కూడా క్లిక్ చేయాలి. దాని తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ కు లింక్ చేయబడినటువంటి మొబైల్ నెంబర్ను కూడా నమోదు చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ కు ఓటీపీ నెంబర్ వస్తుంది.
ఆ నెంబర్ను కూడా నమోదు చేయాలి. దాని తర్వాత సమర్పించు బటన్ పై క్లిక్ చేయాలి. మీ కేవైసీ అనేది పూర్తి అయిన వెంటనే, ఈ కేవైసీ తో పాటుగా ల్యాండ్ వెరిఫికేషన్ కూడా చాలా అవసరం. పీఎం కిషన్ యోజన 18వ విడత పొందేందుకు ల్యాండ్ వెరిఫికేషన్ కూడా చాలా ముఖ్యం. మీరు గనక ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తి చేయకుండా ఉన్నట్లయితే వెంటనే దానిని పూర్తి చేయండి. లేకుంటే 18వ విడత ప్రయోజనాన్ని మీరు పొందలేరు.బ్యాంకు ఖాతాతో ఆధార్ లింక్ చేయండి : మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ కాకపోతే మీరు పిఎం కిసాన్ యోజన యొక్క ప్రయోజనాన్ని పొందలేరు. మీరు ముందుగా బ్యాంకు దగ్గరకు వెళ్లి మీ ఖాతాకు ఆధార్ కార్డు లింక్ ను జత చేయండి..
లబ్ధిదారుల జాబితా : మీరు పిఎం కిసాన్ ను దరఖాస్తు చేయడంతో పాటు లబ్ధిదారుల జాబితాలో మీ పేరును కూడా తనిఖీ చేసుకోవడం చాలా అవసరం. ఈ లిస్టులో కనుక మీ పేరు లేకుంటే ఇన్ స్టాల్ మెంట్ మీ ఖాతాలో జమ చేయడం కుదరదు. మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ తోనే లబ్ధిదారుల జాబితాలో మీ పేరును చెక్ చేసుకోవచ్చు. అలాగే పిఎం కిసాన్ సమ్మన్ ఫండ్ స్థితిని చెక్ చేసేందుకు ప్రధానమంత్రి కిసాన్ యోజన వెబ్ సైట్ https://pmkisan. gov. in ను సందర్శించాలి. అలాగే ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ కింద ఉన్నటువంటి నో యువర్ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అలాగే దీని స్థితిని తనిఖీ చేసేందుకు మీ ఆధార్ కార్డు యొక్క నెంబరు మరియు క్యాప్చ కోడ్ ను నమోదు చేయాలి. ప్రస్తుతం దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు కనిపిస్తుంది. దానిని ఒకసారి చెక్ చేసుకోండి.
ఇకపోతే తెలంగాణలో మాత్రం ఆగస్టు 15 తర్వాత రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ ఖరీఫ్ సీజన్ లో అర్హులైనటువంటి ప్రతి రైతుకు ఎకరాకు రూ. 7,500 ఇవ్వనున్నారు. అయితే పీఎం కిసాన్ ద్వారా కేవైసీ చేయనివారు ఎవరైతే ఉన్నారో వారు కేవైసి చేస్తే ఈ సారికి 4000 రూపాయలు వస్తాయి. ఇలా మొత్తం 11,500 రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.